మధ్య తరగతి అబ్బాయి పయనం (ఎటువైపో అతనికే అర్థం కాని గమ్యం)
మధ్య తరగతి అబ్బాయి పయనం (ఎటువైపో అతనికే అర్థం కాని గమ్యం)
i. కొన్ని జీవితాలను రాయడానికి, చూడడానికి దేవుడికి కూడా ఇష్టంఉండదేమో లేదంటే ఆయన కూడా పని భారం ఎక్కువ అయి, తోచినది రాద్దాం లే, అనుకోని రాస్తాడో తెలియదు కానీ, ఎంత ప్రయత్నం చేసిన మార్పు,కూర్పు లేని జీవిత గాధే నా ఈ కథ యొక్క సారాాంశం.
ii. అందరి లాగే నేను కూడా ఎదో సాదిస్తాను, ఉద్దరిస్తాను అనుకోని, నన్ను ఈ భూలోకానికి పరిచయం చేసినా, నా తల్లితండ్రుల కల కూడా నేరవేర్చలేని, వారికి ఒక్కసారి కూడా సహాయపడని, ఒక కుమారుడి జీవిత గాధే నా ఈ కథ యొక్క సారాాంశం.
ఆనాటి రాజులు సంపదను, రాజ్యాలను కాపాడుకోవడానికి యుద్ధాలు చేసేవారు. ఆ యుద్దాలు కూడా సంప్రదాయంగా, అందరి సమక్షంలో జరిగేవి. ఇప్పుడు కూడా యుద్దాల మాదిరిగానే గొడవలు జరుగుతున్నాయి కానీ ఈ గొడవలు ఒక అమ్మాయి ప్రేమ కోసమో, ఎదుటివాడిని జయించటం కోసమో, అవతలి వాడిని గుప్పెట్లోపెట్టుకోవడం కోసమో జరుగుతున్న, అర్థం లేని,ఎప్పటికి అర్థం కాని యుద్దం.