khadar Basha

Inspirational

4  

khadar Basha

Inspirational

జాలరి తెగువ

జాలరి తెగువ

1 min
1.0K



చిరు చిరు జల్లుల 

స్వాగతిస్తూ పైరగాలి తో పరవశించిపోతున్నాయి....


బెక బెక శబ్దాలతో బావురుమంటున్న కప్పలు...


ఎండుచాప తడిసిపోద్దెమనని తట్టా బుట్టల్తో సర్థుతున్న పల్లెకార్లు...


మొగదారమ్మకో కోబ్బరి కాయ కోట్టి సద్ది మూట తో బయలు దేరాడు పోచయ్య..


నది ఒడ్డున జాలరీ పోచయ్య వలను సరి చేసుకోంటున్నాడు...


జాలరీకి కూతవేటు దూరంలోనే నదీప్రవాహ ధాటిన గమనిస్తున్నాడో పెద్దాయన......


అడపాదడపా చేతిలో దోరికిన రాయితో నదీజలాలపై విసురుతున్నాడు...


తలమీద పై పంచ తోలగిస్తే వ్యాపారస్తుడిలాగా మెడలో బంగారు దండ తో చూస్తే ధనవంతుడిలానే ఉన్నాడు...


తుఫాను సూచనలు కనపడుతున్నవి గదా!


ఈ సమయంలో వేటకు వేళుతున్నావేం కేకేశాడు...పెద్దాయన


నేనేమయినా యుద్దానికి బెదిరే మారాజనుకున్నావా!

ఏగాదిగా చూశాడు....పోచయ్య!


అ..క్షణం....పెద్దాయన....చేతిలోని....రాయిని నీటీలో గట్టిగా విసిరాడు.....


ఉవ్వెత్తున ఎగిసిపడిన నీరు.


తనలోని భయాన్నీ పారాద్రోలానన్నంతగా పెద్దాయన ముందడుగు వేశాడు.. 


కోంచం దూరంలో తన గుర్రం దగ్గరగా వచ్చి ముసుగు సరి చేసుకోని కదనరంగానికి కధంతోక్కుతు రాజదర్భారు వేపు పయనం సాగించాడు పెద్దాయన వేషంలోనున్న సింహళ దేశ రాజు శివ చక్ర సేన మహరాజు.


రాజ దర్భారు...


అశీనులయిన మహరాజు దేశ శివ చక్ర సేనుల వారు..


మహమంత్రి!  షేర్ ఖాన్ తో యుద్దానికి సన్నాహలు  మొదలుపెట్టండి.


సేనాధిపతి! ఆయుధ పూజ చేయండీ.


స్త్రీలని,పిల్లలనీ, వృద్దులనూ సురక్షిత కందకాలలో తరలించండి.


జాలరీ తెగువ చూసి......

తనలోని అటకెక్కిన ధైర్యాన్నీ....

జమ్మీ చెట్టు పైనున్న అయుధాలు ధరించి....

యుద్దంలో నేర్పరితనాన్ని ప్రదర్శించి...

తన దేశాన్ఫి,దేశ ప్రజలను రక్షించుకోన్నాడు.....


జాలరీ పోచయ్యను రాజ దర్భారుకు పిలిపించి వజ్ర వైడూర్యాలతో సత్కరించాడు.

సుభిక్ష పరిపాలనతో దేశ ప్రజల అభిమానాన్ని పోందాడు మహరాజు.

              ★★★★★

ఈ కధ లోని నీతి నీవు పిల్లివి కాదు,

పులి లాంటి శక్తి నీలో అంతర్గతంగా నిబిడికృతమై ఉన్నదని గ్రహించమని తెలియజేస్తున్నది.

            ◆◆◆◆◆

ఇది నా స్వీయ రచన ఎవరి అనుకరణ

కాదు అని హామీ ఇస్తున్నాను....

             ●●●●●

పేరు:ఖాదర్ భాషా "గుల్ ఫాం"

ఊరు: గుంటూరు

శీర్షిక: జాలరీ తెగువ

 



















   


Rate this content
Log in

More telugu story from khadar Basha

Similar telugu story from Inspirational