బ్రతుకు యోగం
బ్రతుకు యోగం
బ్రతుకు యోగం
//బుర్రా సాయిబాబు//
వీర్రాజుని అలారం లేపలెదు, అతని భార్య చంద్ర లేపింది, "ఏమండి ఏదో యోగా క్లాసు అన్నారు,లేవండి" బడ్డకంగా లేచాడు వీర్రాజు.అతను చేసే పనికి,యోగా క్లాసుకి సంబంధం లేదు. వీర్రాజు ఒక పాకింగ్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నడు.నిన్న సాయింత్రం వర్కర్లని అందర్ని పిలిచి ఎం డి శ్యాంబాబు" మన కంపనీ చాలా నష్టాలలో ఉంది, అందుకే కొంతమంది ఉద్యోగస్తులని తొలగించడం జరిగింది. అందువల్ల మీకూ పనివత్తిడి పెరిగింది, మీకు వత్తిడి తగ్గడానికి రేపటినించి యోగా తరగతులు ఏర్పాటు చేసాను. ఆందరూ తప్పనిసరిగా హాజరుకావాలి." అన్నాడు.
వీర్రాజుకి శ్యాంబాబు లాజిక్ అర్ధం కాలేదు. కరోనా మూలంగా 5 నెలల పాటు జీతం లేకుండా అప్పులు చేసి సంసారం గడిపిన తను, ఆ అప్పులవాళ్ళు ఇప్పుడు వెంట పదుడుతూంటె, ఇప్పటికీ పూర్తి జీతం ఇవ్వని శ్యాంబాబు, వత్తిడి పోకొట్టటానికి పూర్తి జీతం ఇస్తానని చెప్పడం మానేసి యోగా అంటాడేమిటి? అనుకున్నాడు.
యోగా మొదలయ్యింది. యోగా ఇనస్టక్టరు అసలు రహస్యాన్ని తన ఉపన్యాసంలో చెప్పకుండా
నే చెప్పాడు. యోగా వల్ల కంపేనీ ఉత్పత్తి పెరుగుతుందని వివరించాడు , ఇనస్టక్టరు చాలా చెప్పాడు గానీ చెప్పిన మిగిలిన ఉపయోగాలేవీ వీర్రాజు కిఅర్ధం కాలేదు
తాడాసనం గురించి చెప్తున్నప్పుడు, అతనికి ఒక సందర్భం లో ఆత్మ హత్య చేసుకుని చనిపోదామనుకుని సిద్ధం చెసుకున్న తాడు గుర్తొచ్చింది.
శవాసనం వేస్తూంటే, అప్పులవాళ్ళూ తనని పాడెపై పెత్తుకుని మోసుకెడుతున్నత్లు అనిపించింది. అయినా ఎందుకొ ఈ ఆసనం నచ్చింది అతనికి.
యోగా వల్ల మనశ్శాంతి వస్తుందని చెప్తూంటే, ఒక ఏడాదిగా తన భర్యకి ఒక్క చీర కూడా కొనలేని దౌర్భాగ్యం, దుఃఖం లా తన్నుకొచ్చింది. వీర్రాజు తొ ఎవరొ చెప్పారు, 15 రోజులకి యోగా నేర్పినందుకు, కంపనీకి ఖర్చు 10 వేల రూపాయలట.
వీర్రాజు కి జీతం నెలకి 6 వేలు,ఎంత దోపిడి, రోజూ తను వెసే ఆసనాలే కదా?ఒక్ శీర్షాసనం తప్ప అన్నీ రోజూ వేసేవేకదా!!
మిషన్లో అట్ట ఇరుక్కున్న ప్రతిసారీ మిషను కింద దూరి నౌకాసనమే కదా వేసేది, పాదహస్తాసనం వెయ్యకుండా గొట్టం లోంచి వైరు లాగగలడా?
యజమాని తెలివితక్కువ తనానికి నవ్వుకున్నాడు వీర్రాజు