STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

కాకి కథ

కాకి కథ

1 min
275

కాకికథ

(తేటగీతి మాలిక )


కావు కావు మటంచును కబురు తెచ్చి

ముందు సూచన జేసెడి పుణ్య నిధిగ

వాయసంబొక బంధువై వసుధ లోన 

తిరుగు చుండును నిత్యము దిశలయందు.


మందునికి వాహనంబుగ మానితముగ

పితృతిథుల యందు గేస్తులు పిలిచినంత

వేళమీరక తినుచుండి పిండములను

పుణ్య మెంతయో కలిగించి పోవు పక్షి.


సంఘమందున ప్రేమను చాటి చెప్పు

బాధ కల్గగ నార్తితో పరుగు పెట్టి 

వచ్చి వాలుచు నిల్పును బంధములను

కాకి జాతికి యున్నట్టి కలిమి యదియె.


కోకిలమ్మల పిల్లలన్ సాకుచు కూర్మితోడ

బద్ధకంబును జూపని పక్షి యనగ

కాకి కున్నట్టి తెలివిని కాంచి చూడ

నబ్బురంబుతో జనులెప్డు 'నాహ!'యనగ

కాకి కడవలో జలముల కథను వినగ

తేటతెల్లమౌ కద కాకి తెలివి మనకు.


కాలగతిలోన కాకులు కానరాక

చెదిరి పోయిన వక్కట చింతతోడ 

కాకి జాతియె మిగులని కాలమందు 

పక్షి జాతిని కాపాడ కదలి వచ్చి

జనులు సంఘటితమగుచు జలము లిడుచు

పాదపంబుల బెంచుచు వరలి నపుడు

కాకి గూళ్లను చెట్లపై కట్టియుంచి

సుఖముగానుండ వసుధకు శుభము కలుగు.//


Rate this content
Log in

Similar telugu poem from Classics