STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

జలనిధి

జలనిధి

1 min
318


(బాల పంచపదులు )


విలువగు సంపదల నెలవగు

కలికి యా సిరికి పుట్టినిల్లగు

జల చరంబులకు నావాసమగు

జలనిధిని గాంచ తోషం కలుగు

నీ ఇల కు యాధారమగు విజయా!


ఖనిజరాశులకిది నిధియన

ఘన గంభీరరతతోడ నిల్చిన

ధ్వని తరంగపు సమ్మేళనమన

ఫేన సమన్వితమౌ కల్లోలమన

సాగర విన్యాససోయగం విజయా!



జీవనకాధారమౌ భూతమగుచు

నావల నావల కొడ్డున చేర్చుచు

త్రావుజలము మేఘములకిడుచు

నీ వసుధకు ప్రాణము నొసగుచు

తావిషము నిలుచుండును విజయా!



వానకు మూలమగు నీ జలనిధి

శ్రీనిలయ బహు రత్నపు పెన్నిధి

ఘనడా శేషశాయినివాసమిది

జనులకు సౌభాగ్య దాయకమిది

వరుణుని జన్మస్థానము విజయా!



కళకళలాడుచుండు సముద్రము

ఫెళఫెళ గర్జించు నీ తరంతము

విలయము తెచ్చుచుండు నీ పారము

బలుపుగ జిమ్మ బడబానలము

నిలువదిట భూగోళము విజయా!



చల్లనిదౌ నా యంబురాశిని కొల్చి 

పిల్లల పాపల కావుమని పిల్చి

మెల్లగా భక్తితో క్రుంకులిడి నిల్చి

 కల్లోలము వలదని ప్రాంజలించి

వేడుచు నుందురు జనులు విజయా!



కలుషితంబు కలుపగ జనము 

మలినమౌ కద ఘన సాగరము

జల చరములకు వచ్చు గండము

పలువిధములుగా కూడు నష్టము

మానవాళికి హాని కల్గు విజయా!



నీరు గాలి భూమి మనకు ప్రాణము

తీరుగానున్నచో నిల్చు జీవనము

తారుమారగుచో వచ్చు ప్రళయము

భారమునొందక కాపాడి మనము 

ప్రకృతినెప్డు ప్రేమించాలి విజయా!

-----------------------------------------------



Rate this content
Log in

Similar telugu poem from Classics