STORYMIRROR

RAKHI PATEL

Romance Fantasy Inspirational

4  

RAKHI PATEL

Romance Fantasy Inspirational

నీ జ్ఞాపకాలతో

నీ జ్ఞాపకాలతో

1 min
10

నీ జ్ఞాపకాల తీరంలో నీ మధురానుభూతుల తేరుతెన్నెలలో మిగిలిపోయాను నేను ఒంటరిగా...

 నీ తోడులేని నా పాదాలు తాకిన ఆ కెరటాలు కూడా వెనక్కి పోతున్నాయి మౌనంగా....

 నీ కలయిక కోసం నాలో రగిలే విరహ ఆవిరిని చల్లబర్చలేక వేడిగా మారుతున్నాయి ఆ శీతల పవనాలు కూడా...

 నా హృదయలోని ఈ విరహఘోషకి ఆ సాగరం కూడా వింతగా దిగ్భాంతి చెంది చూస్తుంది నా వంక,

నా మదిలోని నీ తలపుల వెల్లువంతా ఒక్కసారిగా ఉప్పొంగి కన్నీరుగా మారి శాంతిస్తుంది నా చిన్ని హృదయం,

 నీవు నా స్వప్నంలో చేరి ప్రతి రేయి ఇస్తున్న ఓదార్పుల చిరుజల్లులు నను తాకగా..

 ఇలా నీ ఓదార్పులో నేను ప్రతిరోజు నీ జ్ఞాపకాలతో గడుపుతున్నా అను క్షణం, ఇంక ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు, చెలీ నువ్వు లేని ఈ ఒంటరి జీవితం,


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Romance