మొక్కలను నాటండి
మొక్కలను నాటండి
మొక్కలను నాటండి!
(ఇష్టపది )
భూగోళమంతయును భుగభుగా మండెనిట
పోగాల మనుచుండి భూజనులు క్రుంగిరట!
పర్వతంబులు లేవు పైరగాలులు లేవు
పచ్చదనమును బెంచు పాదపంబులు లేవు
సర్వంబు నాశమై జవజీవములు లేవు
చక్కనౌ సిరులిప్డు జగతిలో కనరావు
జీవంబు నిడుచెట్టు ఛిద్రమై పోవగా
జీవులకు కష్టమట శ్రేయంబు నీయండి!
దైవాల రూపమట తరువులే ధనమంచు
ధరకింత చల్లనౌ దడికట్ట కదలండి!
పుడమినే బ్రతికించ మొక్కలను నాటండి!
కడగండ్లు తొలగునట!కలిమినే పెంచండి!
ప్రాణవాయువు తోడ వర్షాలు కురియునట!
ప్రాణ మిచ్చెడి చెట్టు వాయువుకు మిత్రుడట!
వికృతపు చేష్టలను విడనాడి జీవించి
ప్రకృతిని రక్షించ వసుధకే మేలగును.//
