మన మనుగడ
మన మనుగడ
మన మనుగడ
(ద్విరదగతి రగడ )
మంచుపర్వతంబుల మనుగడేమౌనురా?
ముంచుచున్నది వేడి పుడమికేమౌనురా?
శుద్ధజలంబెచ్చట?చూడుమా నదులలో!
మొద్దు నిద్దురపోవ మునుగమా ముప్పులో!
గాలియందున చాల గరళమున్నది బాల!
కాలిపోవుట నిజము!కనుము!ఘోరము బాల!
వెదకి చూడగ లేవు పుడమిలో తరువులే!
మొదలు నఱకిన చెట్లు భువిని మండించులే!
గనులు త్రవ్వుచు నుండ కష్టములు పడవచ్చు!
జనులకేగతి పట్టు? సంతాపములు హెచ్చు!
ప్రకృతిని కాపాడగ వసుధకే మేలగును!
వికృతముగ చరియించ పృథ్వికే చేటగును!
వ్యర్థముగ కాలమున పరుగిడుట మానుమా!
సార్థకంబగు పనులు సల్పి జీవించుమా!
పక్షులను ప్రేమించు!పశువులను రక్షించు!
తక్షణంబీ పుడమి తాపమును తగ్గించు!//
