STORYMIRROR

Dr.Kondabathini Ravinder.

Inspirational

4  

Dr.Kondabathini Ravinder.

Inspirational

గురుపూజోత్సవం

గురుపూజోత్సవం

1 min
350


  

    


గుండె లోన కట్టి గుడిని పూజిద్దాము

కొలువుదీరియున్నగురుల నెల్ల

విద్య నొసగు గొప్పవిలువలు నేర్పేడు

ఆది దేవు డితడు యవని కనుచు


గ్రహ గతుల నడక గతితప్పునో యేమొ!

తప్ప బోడు గురువు తన నడతను

 జాతి రీతి దిద్ది జాతీయతనుపెంచి

వరలు చుండు విశ్వ నరుడు వాడు.


పస్తులుండి మాకు పాఠాలు బోధించి

బతుకు గడిపి నాడు వెతల తోడ

ఇంటి లోన బాధ లెగసి తన్నిన గాని

వేళ దప్పి బడికి వెల్లబోడు 

  


ముత్తెమంటివాడు"ముత్తెన్న"సారు          రతనమంటి వాడు"లక్ష్మీ నరసయయు

రామ సక్క నోడు "రాఘవ"మాస్టారు

తలచి నంతయెడద తనివి జెందు


నీతి కతలు దెల్పి నియతిని కలిగించి

మసలు కొమ్ము సమత మమత కలిగి

చాటి చెప్పి నారు సద్గురులెందరో

వందనాలు గురువు లందరికిని


రాగ చైతన్య దీపాలు ప్రకృతియందు

పరిఢవిల్లాలి ముద్దుగ ముచ్చటించ

స్నేహ సౌహార్ద్ర చంద్రిక చేయి చాచి

భావ గీతాలు పాడాలి పరవశించి


నాడుచెప్పినగురువులజాడలందు      

నేటి గురువులు నడవాలిమేటి బాట

దేశ దేశాల మనజాతి ధీరఘనత

పాడు చుండాలి యికమీద పౌరులంత

         

       


 













Rate this content
Log in

More english poem from Dr.Kondabathini Ravinder.

Similar english poem from Inspirational