STORYMIRROR

durgaprasad pisini

Romance Classics Inspirational

3  

durgaprasad pisini

Romance Classics Inspirational

ఓ పవిత్రమైన తొలి ప్రేమ కథ

ఓ పవిత్రమైన తొలి ప్రేమ కథ

12 mins
276

ఈ మానవ జీవితాలు అనేవి దేనికి,ఎందుకు అనే ప్రశ్నలకి ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర సమాధానం ఉండదు. ఎవరు వెతకాలి అని అనుకోరు.అనుకొని వెతికిన ఈ ప్రశ్నలకి సమాధానం దొరకదు. కాని మనిషి జీవించిన తన ఆయువు ఆంతటిలో ప్రతి క్షణం ప్రేమ తప్పకుండ కావాలి. ఆలాంటి ఓ ముగ్గురి ప్రేమ గమనాలను తెలుసుకునే ప్రయత్నంమే ఈ


      ఓ పవిత్రమైన తొలి ప్రేమ కథ. 


  అనగనగా ఒక రామాలయం అనే ఊరు ఉంది. 

ఆ ఊరులో అప్పారావు, గంగామ్మ అనే ఇద్దరు దంపతులు ఉన్నారు.ఆ దంపతులుకి ఒకే ఒక్క కూతురు, తన పేరు swetha. వీరిది చాలా సంప్రదాయ కుటుంబం పక్క హిందుమతం. వీరికి ఒక్క పాపే కాబట్టి చిన్నప్పటి నుండి చాలా గారభంగా పెంచుతారు😍. కాలం గడిచే కొలిది swetha పెరిగి పెద్ద అవుతుంది. వయసు పెరిగే కొద్ది swetha వాళ్ల నాన్న తనకి వివిధ రకల కళలు నేర్పిస్తారు. 

భరత నాట్యం, చిత్ర లేఖనం,కథలు రాయడం etc. ఇంకా swetha kho-kho కూడా చాలా బాగా ఆడుతుంది.తరువాత schoolలో చేర్పిస్తారు.


   Swetha బాగా చదువుతుంది.ఇంకా ప్రతి సంవత్సరం భారత నాట్యం పోటీలలో మరియు kho-kho పోటీలలో తనేదే 1st place 🏆. ఇంకా Swetha నీ తన తల్లిదండ్రులు చాలా ప్రేమ అనురాగాలతో పెంచుతారు.ఆలా కాలం సాగే కొద్దీ swetha 8th Class కి వచ్చేస్తుంది.అప్పుడే వాళ్ల Class కి ఒక కొత్త విద్యార్ది వస్తాడు.

     

    తన పేరు పీటర్. ఇతను ఒక అనాధ.చిన్నప్పుడే తన తల్లిదండ్రులు accident లో చనిపోయారు 😔. చిన్నప్పటి నుండి ఇతను వాళ్ల పెదనాన్న దగ్గరే ఉండి పెరిగి పెద్ద అవుతాడు.ఇతనకి Helping చేయడం అంటే చాలా ఇష్టం😊.వీరిది క్రీస్తవా మతం.ఇతను ప్రతి ఆదివారం క్రమం తప్పకుండ church 💒 కి వెళ్తాడు.

   

  పీటర్ చదువుతుంది ENGLISH Medium కాబట్టి మొదటిలో చాలా ఇబ్బందిగా ఉండేది. ఓ మూడు నెలలు తరువాత ENGLISH medium అలవాటు అయిపోయింది.swetha నీ పీటర్ ఎప్పుడు సరిగా చూడాలేదు😁. తొలిసారి తనని 9th class లో భారత నాట్యం పోటీలలో చూశాడు.swetha నృత్యం చాలా superb గా చేస్తుంది😍.

    

తన కళ్ళు చూసి పీటర్ WOW 😲 అనుకున్నాడు మనసులో. 


"తనని చూసినప్పుడు పీటర్ చుట్టూ ఉన్నా ప్రపంచంన్ని మర్చిపోయాడు. 

చూస్తుంది కొన్ని గంటల సమయమే అయిన అతను ఊహించుకుంటుంది మాత్రం తన జీవిత కాలంనీ."


    అతను అనుకున్నాటే Swetha నే FIRST prize కొట్టెస్తుంది😇. program అయిపోతుంది అందరు ఇంటికి వెళ్లిపోతారు.తనకి congrats🎉🎊చెప్పాడానికి చాలా TRY చేస్తాడు పీటర్ కాని చెప్పలేడు😑. ఇంకా తరువాత పీటర్ తనని చూసా అన్న సగం సంతోషంలో, తనకి congratulations చెప్పలేదు అన్న సగం నిరాశలో ఉండి ఇంటికి వచ్చేస్తాడు🙂. Night అంత తన గురించే ఆలోచిస్తాడు.అప్పుడు తన గురించి ఇలా కవిత రాసుకుంటాడు ✍️. 


కలువ లాంటి కళ్ళు

నెమలి లాంటి నాట్యం

కమ్మని సాయత్రం

  

అని కవిత రాస్తాడు.

  

    తరువాత రోజు school కి వెళ్లి తన గురించి అన్ని విషయలు తన Friends ద్వారా తెలుసుకున్నాడు. తనతో ఎలా అయిన మాట్లాడాలి అనుకొని తన దగ్గరకి వెళ్తాడు కాని మళ్లీ తనని చూసి వెనకకి వచ్చేస్తాడు 😶. చాలా సార్లు చెప్పాలి అని ఇలానే TRY చేస్తాడు కాని చెప్పలేడు. ఈలోపు 10th class లోకి వచ్చేస్తారు. ఆ ముందు రోజు రాత్రి గట్టిగా బలంగా అనుకొని ఎలా అయిన తనతో మాట్లాడాలి అని అనుకుంటాడు.ఆ రోజు పీటర్ అనుకునే రోజు వచ్చేస్తుంది.మాట్లాదం అని పీటర్ swetha దగ్గరకి వెళ్తాడు.మళ్లీ మాట్లాడకుండా వెనకకి వచ్చేస్తాడు 😏. 

     

పీటర్ నీ 

"తనతో మాట్లాడు అనే గుండె ధైర్యంనీ

ఎదో తెలియని భయం వెనకకి నెట్టేస్తుంది. "

ధైర్యం సరిపోవట్లేదు.


అలా పీటర్ swetha నీ చూస్తూ మాట్లాడకుండా 10th class నీ గడిపేస్తాడు😏.10th class final exams కూడ రాసేస్తారు.అందరు బాగా రాస్తారు. అందరు happyనే. కాని పీటర్ మనసులో ఎదో తెలియని నిరాశ. ఆ రోజు వాళ్ల 10th Class FAIRWELL day. వాళ్ల చివరి రోజు పీటర్ swetha తో ఎలా అయిన మాట్లాడాలి అనుకొని వెళ్లాడు. 

  

Swetha : hi పీటర్ ఎలా ఉన్నావు? 

(పీటర్ కి ఒక్కసారిగా గుండె డబ్ మని గట్టిగా కొట్టుకుంది.) 


పీటర్ : hi Swetha బాగున్నా . నువ్ ఎలా ఉన్నావు? (అని మెల్లగా మాట్లాడుతాడు) 


Swetha: బాగున్నా.ఇంతకి Exams ఎలా రాశావు? 


పీటర్: బాగునే రాశాను. నువ్ ఎలా రాశావు? 


Swetha: ఆ బాగానే రాశాను. సరే నాకు పని ఉంది. 

                                Bye


పీటర్: ఆగు Swetha నీతో ఒక మాట చెప్పాలి.


Swetha: okay చెప్పు పీటర్

(పీటర్ కి ముఖం మీద చెమటలు పడతాయి) 


పీటర్ : అది... I LOVE YOU❤.. నేను నిన్ను ప్రేమిస్తున్నా.. (చాలా slow గా) 


Swetha : what? 


పీటర్ : అవును swetha నువ్ విన్నది నిజమే. నేను నిన్ను చాలా true గా love చేస్తున్నా. నిన్ను FIRST time dance చేసినప్పుడు చూసాను. అప్పటి నుండే నేను మా MOTHER నువ్ అని ఊహించుకుంటున్నా. 

నువ్ ok అంటే Future లో పెళ్లి కూడ చేసుకుంటా.. 


దానికి swetha ఏమి చెప్పకుండా అక్కడ నుండి చాలా నిశబ్దంతో ఇంటికి వెళ్లిపోతుంది😔. పీటర్ కీ అక్కడ ఏమి జరుగుతుందో అర్దం కావడం లేదు. పీటర్ కీ కళ్లలో నీళ్లు తిరిగుతున్నాయ్. పీటర్ కీ ఏమి చెయ్యలో తెలియక చాలా దుంఖంతో 😭ఇంటికి వచ్చేస్తాడు. తరువాత రోజు నుండి సెలవులు కావడం వల్ల మరి అప్పటి నుండి School కీ వెళ్లలేదు. పీటర్ తన కోసంమే ఆలోచిస్తాడు.🤔 Swetha అసలు ఎందుకు silent గా వెళ్లిపోయింది. నేను అంటే తనకి ఇష్టమా లేక ఇష్టం లేకుండ వెళ్లిపోయిందా? ఆలా ఆలోచిస్తూ ఉంటాడు.


తనని కలవడానికి పీటర్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు కాని వీలుకాదు.ఇలా వేసవి సెలవులు ముగిస్తాయి. అందరు Tc లు తీసుకోడానికి school కీ వస్తారు. అప్పడు swetha, పీటర్ లు కూడ వస్తారు. పీటర్ తనతో మాట్లాడం కాని కనీసం చూడడం కాని చెయ్యదు. ఆలా తనతో మాట్లాడం జరగదు. చివరిగా తన Friends ద్వారా తన ఇంటర్ College 

తేలుసుకొని ఆ College లో join అవుతాడు.

ప్రతి జీవికి ప్రతి ఒక్క దశ లోని ప్రేమ కావాలి. ప్రేమలో గెలుపులు పుట్టినప్పుడు తెలియదు పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తాయి. నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ అంటే మనం ప్రేమించే వాళ్లకి మనము పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చేయడం.ఇంకా మన ప్రేమను అంగీకరించి పెళ్లి జరగకపోతే వాళ్లకి మన జీవితం నూటికి నూరుశాతం త్యాగం చేయాలి. ఒకవేళ మన ప్రేమను తిరస్కరించినట్లు అయితే వాళ్ళని గౌరవించి వాళ్ల జీవితం నుండి వెళ్ళిపోవాలి. 

మన కథలో ఒక అనాధ అయిన పీటర్ అనే వ్యక్తి తన స్వచ్ఛమైన తొలి ప్రేమను పొందగలడా? లేదా?  


Part-1 కంటిన్యూషన్.... 

          

     ఓ పవిత్రమైన తొలి ప్రేమ కథ పార్ట్ 2

   

పీటర్ శ్వేతకి లవ్ ప్రపోజ్ చేసిన తర్వాత శ్వేతా ఎందుకు అక్కడి నుండి వెళ్లిపోయిందో తనకు అర్థం కాలేదు.మెల్లగా శ్వేత వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తన కాలేజ్ తెలుసుకుని అక్కడే అడ్మిషన్ తీసుకున్నాడు.

పీటర్ తన ఇంటర్ కాలేజ్ ఫస్ట్ రోజు కాలేజ్ 9:30 అయితే 8:30 కే క్లాస్ కి వెళ్ళి కూర్చున్నాడు.కాలేజీ కొత్త ఫ్రెండ్స్ అందరూ వచ్చారు.ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్నారు. "ఏంటి 9:30 అయిపోయింది శ్వేతా మాత్రం ఇంకా రాలేదు" అని మనసులో అనుకున్నాడు పీటర్. అనుకున్న మాటల్లోనే శ్వేత వచ్చింది. పీటర్ పక్క బెంచ్ లో కూర్చుంది. శ్వేతా పీటర్ పక్క బెంచ్లో కూర్చున్న తర్వాత అప్పటివరకు మాట్లాడుతున్న పీటర్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. తల కిందకు దించేశాడు. గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని వేగంగా కొట్టుకుంటోంది. కాలేజ్ మొదటి రోజు కాబట్టి క్లాసులు పెద్దగా జరగడం లేదు. పీటర్ శ్వేత ని చూద్దాం అని తల పైకి ఎత్తాడు కాని చాలా భయపడి పోతున్నాడు. శ్వేత తన కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకుంటే తన వాయిస్ విని తన మనసులో సంబరపడిపోతున్నాడు.ఈలోపు లంచ్ బ్రేక్ వచ్చేసింది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లంచ్ కి వెళుతున్నారు. అప్పుడు శ్వేత కూడా వెళ్ళిపోతుంది. తనతో ఎలా అయినా మాట్లాడాలి అని తనిని ఫాలో చేస్తున్నాడు పీటర్. అప్పుడు వాళ్ళ కాలేజీ గేటు దగ్గర తనని అడ్డగించి నేను చెప్పిన విషయం ఏం చేసావ్ అసలు? అసలు నేను అంటే నీకు ఇష్టమా లేదా ? చెప్పు శ్వేతా నేనంటే నీకు ఇష్టమా లేదా అసలు ఎందుకు నాతో మాట్లాడటం లేదు.నేను నిన్ను true గా లవ్ చేస్తున్న చాలా స్వచ్ఛంగా లవ్ చేస్తున్నా నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను శ్వేత. అప్పుడు దానికి శ్వేత ఈ ప్రేమలు అంటే నాకు అస్సలు నచ్చవు. ఈ వయసులో ఇవి చాలా సాధారణం. మాది చాలా సాంప్రదాయ కుటుంబం నా నుండి ఇలాంటివి ఆశించకు అని అంటుంది. దానికి పీటర్ నేను నిన్ను నిజంగానే చాలా చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు దానికి శ్వేతా ఇంకెప్పుడు నా దగ్గర ఇలాంటి విషయాలు మాట్లాడకు గుడ్ బై అని చెప్తుంది..  

      పీటర్ కి ఏం చేయాలో తెలీక అక్కడినుంచి సైలెంట్ గా బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పీటర్ అంతా ఒక్కసారిగా ఆలోచిస్తాడు నేను చేస్తున్నది తప్పా ఒప్పా అని? 

ఆలోచించి ఆలోచించి ఆ ఆలోచనతోనే నిద్రపోతాడు. పీటర్ తర్వాత రోజు నుండి శ్వేత ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చాలా స్వేచ్ఛగా వదిలేస్తాడు. శ్వేత చూడకపోయినా, తనతో మాట్లాడకపోయినా తనని చూస్తూ తన ప్రేమని చాలా ఆనందిస్తాడు. 

       అలా చూస్తూ తన ఫీలింగ్స్ నీ ఫీల్ అయ్యి వన్ సైడ్ లవర్ గా మారిపోతాడు. తన మీద కవితలు రాసుకొని ఫీల్ అవ్వుతూ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్తాడు.అలా ఆ కాలంలో వాళ్ల ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తవుతాయి.అందరూ పాస్ అయ్యి సెకండియర్ కి వస్తారు.పీటర్ కి శ్వేత మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది. చదువుతుంది ఇంటర్ సెకండియర్ అయిన ప్రాణంగా ప్రేమిస్తాడు(ఎంతైనా ఆనాధ కదా). తనతో ఎలా మాట్లాడాలో తెలియక తనని చూస్తూ గడిపేస్తాడు. పీటర్ ని ఎప్పటికైనా ప్రేమిస్తుందని ఎదురు చూస్తూ కలలు కంటూ ఉంటాడు. పీటర్ ది వన్ సైడ్ లవ్ కావడం వలన తనని రోజు స్పెషల్ గా చూస్తాడు కాని చదువునీ మాత్రం అశ్రద్ధ చేయలేదు. సెకండ్ ఇయర్ పరీక్షలు పూర్తవుతాయి. 

    ఆ తర్వాత రోజే వాళ్ళ ఫేర్ వెల్ డే. అందరూ డాన్స్ లు ఇరకొట్టేస్తారు. శ్వేత కూడా భరతనాట్యం ఇరకొట్టేస్తుంది. పీటర్ కి ఒక్కసారిగా శ్వేత టెన్త్ క్లాస్ లో చేసిన భరతనాట్యం డాన్స్ గుర్తుకు వచ్చింది. ఎవరికీ తెలియకుండా తనలోనే తానే నవ్వుకున్నాడు. చివరగా ఫేర్ వెల్ పార్టీ అయిన తర్వాత శ్వేత పీటర్ దగ్గరకు వచ్చి "సారీ పీటర్ నేను నిన్ను ఏమైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు అని చెప్పి నీ ఫ్యూచర్ జీవితానికి ఆల్ ది బెస్ట్ "అని అంటుంది. దానికి పీటర్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతాడు. ఇంటర్ సెకండియర్ అయిన తర్వాత అందరు విడిపోతారు. శ్వేత డిగ్రీ చదువుతుంది కానీ పీటర్ మాత్రం తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మధ్యలో ఆపేస్తాడు. తన పెద్ద నాన్న కి సహాయం చేస్తూ జీవనం కొనసాగిస్తాడు. 

         

      శ్వేత రోజు డిగ్రీ కాలేజ్ కి వెళ్తుంటే తనని దారిలో చూస్తాడు.కాలేజీకి వెళ్లకపోయినా శ్వేత ప్రేమ గురించే ఆలోచిస్తాడు.శ్వేత ఇంకా డిగ్రీ కాలేజీలో జాయిన్ అవుతుంది. అందరినీ పరిచయం చేసుకొని స్నేహం చేస్తుంది. వారందరిలో తనకి బాగా ఇష్టమైన వ్యక్తి జాఫర్. డిగ్రీ కాలేజ్ లో తనతో బాగా స్నేహాన్ని పెంచుకుంటుంది. తనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. జాఫర్ కి కూడా శ్వేత పై ముందు నుంచి మంచి అభిప్రాయమే ఉంది. రోజు క్లాసెస్ అయిన వెంటనే క్యాంపస్ లో కలిసి తిరుగుతారు. ఆరోజు భరతనాట్యం పోటీలు,గట్టి పోటీ ఎదురవుతోంది. చాలా కష్టపడి గెలుస్తుంది. అందరూ తనని అభినందిస్తారు జాఫర్ కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్తాడు. దానికి శ్వేత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆరోజు రాత్రి వెన్నెలలో బయట మంచం మీద పడుకొంటుంది. అప్పుడు ఒక కవిత రాసుకుంటుంది. 

     బయట మంచం

     పైన వెన్నెల

     లోపల నా రాకుమారుడు 


అలా ఒకరితో ఒకరు కలిసి తిరిగి రెండు సంవత్సరాలు పూర్తి చేస్తారు. ఒకరోజు శ్వేత కాలేజీ అయిపోయినా తరువాత ఉండు అని అంటుంది. దానికి జాఫర్ ఓకే సరే అంటాడు. అనుకున్నట్టే క్లాస్ అయిపోయిన తర్వాత క్యాంపస్ లో కలుస్తారు. అప్పుడు శ్వేత జాఫర్ నీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది దానికి జాఫర్ ఓకే సరే చెప్పు అంటాడు. నీకు నేనంటే ఇష్టమే కదా అని అడుగుతుంది శ్వేత. దానికి జాఫర్ ఆ ఇష్టమే అని చెప్తాడు. నువ్వు ఒక రోజు నీ డ్రెస్ చాలా బాగుంది అని చెప్పావు కదా ఆరోజు నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. రీసెంట్ గా నా డాన్స్ చూసి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాను చూడు అప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకే నీతో ఉంటే నా జీవితం మొత్తం హ్యాపీ గా ఉంటా అని నమ్ముతున్నా. ఐ లవ్ యు జాఫర్ . దానికి జాఫర్ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాకు ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండదు. నా జీవితం వేరే. ఏమైనా చిన్న ఉద్యోగం సంపాదించి నా తల్లిదండ్రులు హ్యాపీగా చూసుకోవాలి. ఇంకోసారి ఇలా మాట్లాడకు గుడ్ బాయ్ అని చెప్తాడు జాఫర్... 


   

ప్రపంచంలో మనం ఎక్కడ ఎక్కడో మనకు కావలసిన ప్రేమను వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మన ఎదుట చాలా రూపాల్లో తిరుగుతూనే ఉంటాయి. మన ఎదుట అమ్మ నాన్నల రూపంలో ఇంక మన చుట్టూ చాలా రూపాల్లో గొప్ప గొప్ప ప్రేమలు తిరుగుతూనే ఉంటాయి కాకపోతే మనం వాటిని పెద్దగా పట్టించుకోం. స్వచ్ఛమైన నిజమైన ప్రేమలు ఎప్పుడు తక్కువ టైం లో దొరకవు అవి చాలా కాలాన్ని కోరుకుంటాయి. 


  TRUE LOVE ALWAYS WORTH THE WAIT


ఇప్పుడు శ్వేత పరిస్థితి ఏమిటి ? అసలు పీటర్ పరిస్థితి ఏమిటి? శ్వేత ప్రేమ జాఫర్ కు దక్కుతుందా? లేక పీటర్ ప్రేమ శ్వేత కి దక్కుతుందా?  


ఇప్పుడు చూద్దాం


పార్ట్ 2 కంటిన్యూషన్..... 


    ఓ పవిత్రమైన తొలి ప్రేమ కథ పార్ట్ 3


అలా జాఫర్ తనని కాదని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత శ్వేతకి ఏం చేయాలో అర్థం కాలేదు. మనసులో బాధ పడుతూ కుమిలి కుమిలి ఏడుస్తుంది 😭. జాఫర్ తనతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు అని అనుకొని తన ప్రేమను చెపితే అంగీకరిస్తాడు అని అనుకుంది ఒక్కసారిగా తనని తిరస్కరించే సరికి దానిని శ్వేత ఎలా తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు.అలా ఆలోచించుకుంటూ బాధపడుతూ రోడ్డుమీద నడుచుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయింది.ఆరోజు రాత్రి జాఫర్ మీద రాసుకున్న కవితలన్నీ చింపి విసిరేసింది.తర్వాత రోజు శ్వేత కాలేజీకి యధావిధిగా వెళ్ళింది.ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్ కి ఎవ్వరికి చెప్పలేదు.తన మనసులోనే ఈ విషయాన్ని దాచుకొని చాలా బాధ పడుతూ ఉండేది. ఇంతకుముందు జాఫర్ తనతో కనీసం మాట్లాడేవాడు కానీ ఇలా జరిగేసరికి మాట్లాడడం కూడా మానేశాడు. జాఫర్ మాట్లాడడం మానేయడంతో శ్వేత ఇంకా బాధపడుతూ ఉండేది.చేసేదేమీ లేక కొన్ని రోజుల తర్వాత పరీక్షలు ఉండడం మూలంగా బాధ పడటం ఆపి శ్వేత చదువు మీద దృష్టి పెట్టడం మొదలు పెట్టింది. జాఫర్ కూడా చదువు మీద దృష్టి పెడతాడు. అలా వాళ్ళిద్దరూ బాగా చదువుకొని డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్ పాస్ అవుతారు. శ్వేత మాత్రం జాఫర్ కాదనడంతో తనమీద ఇంకా ప్రేమని పెంచుకుంటుంది.

    

    ఈ విషయాలన్నీ శ్వేత టెన్త్ క్లాస్ ఫ్రెండ్ రమ్య కి తెలుస్తాయి.ఈ విషయాలన్నీ రమ్య పీటర్ దగ్గరకు వెళ్ళి తనతో ఇలా చెప్తుంది." పీటర్ పీటర్ శ్వేత జాఫర్ అనే వ్యక్తిని లవ్ చేస్తుంది వాడితో తిరుగుతుంది "అని తప్పుగా చెప్తుంది.ఇది విన్న పీటర్ రమ్య ని చెంప చెల్లుమనేటట్లు కొడతాడు. 

నా శ్వేత అలాంటి మనిషి కాదు నా శ్వేత ఎలాంటిదో నాకు తెలుసు అని రమ్యతో కోపంగా చెప్తాడు. శ్వేత మాత్రం జాఫర్ నే ప్రేమిస్తూ తన మీద ఆశలు పెంచుకుంటుంది. జాఫర్ మాత్రం శ్వేతని లవ్ ప్రపోజల్ చేసిన తర్వాత కనీసం పట్టించుకోడు. 

ఈ లోగా వాళ్లు వాళ్ల డిగ్రీ ఫైనల్ ఇయర్ సెమిస్టరు ఎగ్జామ్స్ రాసేస్తారు.ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రోజు ఫేర్ వెల్ పార్టీ పెట్టుకుంటారు. 

       

      ఆ రోజు అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒక్క శ్వేతా తప్ప. ఫేర్ వెల్ పార్టీ చాలా హడావుడిగా జరుగుతుంది. రాత్రి కాంతులలో డెకరేషన్ మిలమిల మెరుస్తుంటాయి. అందరూ డాన్సులు బాగా చేస్తారు. అదే డిగ్రీ ఫైనల్ రోజు కాబట్టి కొంతమంది వాళ్ళ అనుభవాలు చెబుతూ స్పీచ్ లు ఇస్తారు.అందరిలాగే జాఫర్ కూడా తన అనుభవాలను చెబుతూ స్పీచ్ ఇస్తాడు.మధ్యలో శ్వేత గురించి కూడా చెబుతాడు.శ్వేతా అనే అమ్మాయి నాకు ఒక మంచి స్నేహితురాలు. ఎంత మంచి స్నేహితురాలు అంటే నా ఫ్యామిలీ విషయాలు కూడా షేర్ చేసుకుంటాను. కానీ సడన్ గా ఏమైందో తెలియదు.తను నాకు ఐ లవ్ యు చెప్పింది. ఆ క్షణం నాకు ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. ఎందుకంటే నేను శ్వేతా ని ఎప్పుడూ బెస్ట్ ఫ్రెండ్ గానే చూశాను లవర్ గా చూడలేదు కానీ తను అలా అనేసరికి నా గుండె ఒక్కసారిగా ముక్కలు అయినట్టు అనిపించింది( ఏడుస్తూ) 😭. అలా తన స్పీచ్ ని ముగించాడు. ఇంకా ప్రోగ్రాం అయిన అనంతరం జాఫర్ శ్వేత ని కలిసి మాట్లాడాడు తనతో ఇలా అన్నాడు" సారీ స్వేత నిజంగా సారీ నేను ఎప్పుడూ అలా చూడలేదు నువ్వు నాకు ఒక మంచి స్నేహితురాలు ఎప్పటికైనా నువ్వు నాకు ఒక మంచి స్నేహితురాలు నీ ఫ్యూచర్ లైఫ్ కి ఆల్ ద బెస్ట్" అని చెప్తాడు. దానికి శ్వేత చాలా నెమ్మదిగా థాంక్యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని చెప్తుంది. 


    శ్వేత చెప్పడం అయితే చెప్పింది గాని చెప్పిన తర్వాత ఎలా ఉందంటే ఒక ప్రపంచం తో యుద్ధం చేసిన అంత కష్టంగా ఉంది. ఆ తర్వాత రోజు నుండి జాఫర్ ని కలవడం గానీ చూడడం గానీ శ్వేతా కి కుదరలేదు. శ్వేత కి ఏం చేయాలో తెలియక తన బాధతో కాలాన్ని చాలా కష్టంగా గడుపుతుంది. కొన్ని రోజుల తర్వాత రమ్య శ్వేత ని కలిసి పీటర్ గురించి మొత్తం చెప్తుంది. దానికి శ్వేత షాక్ అయ్యి ఏంటి పీటర్ నన్ను ఇంకా లవ్ చేస్తున్నాడా? నా కోసం ఇంకా ఎదురు చూస్తున్నాడా? అస్సలు నమ్మలేకపోతున్నాను అని అంటుంది. అప్పుడు ఆ రోజు రాత్రి శ్వేత పీటర్ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. ఏంటి ఇది నిజమా నేను తనని కాదని మూడు సంవత్సరాలు అవుతుంది నా కోసం ఇంకా ఎదురు చూస్తున్నాడా? జాఫర్ కాదన్న బాధలో నేను ఇలా ఉంటే నేను తనని కాదని మూడు సంవత్సరాలు అవుతుంది ఇంకెంత బాధ పడుతున్నాడో పీటర్ ఒకసారి రేపు తనని చూడాలి. అనుకున్నట్టుగానే తర్వాత రోజు మార్నింగ్ పీటర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడు పీటర్ ఒక రూమ్ లో కూర్చొని తన మీద రాసుకున్న కవితలన్నీ చదువుతూ ఉంటాడు. అదే టైంలో శ్వేత పీటర్ అని పిలుస్తుంది. పీటర్ ఒక్కసారిగా వెనక్కి తిరుగుతాడు. శ్వేతా పీటర్ ని చూసి షాక్ అవుతుంది. పీటర్ మొత్తం గడ్డాలు పెంచేసి చాలా బాధపడుతూ కనిపిస్తాడు. శ్వేత చూడడం అయితే చూసింది కానీ మనసులో మాత్రం చాలా బాధ పడుతోంది. పీటర్ శ్వేత ని చూసిన వెంటనే రా శ్వేత నీ కోసం ఎదురు చూస్తున్నాను నా కోసం నువ్వు వస్తావు అని నాకు తెలుసు నీ కోసమే నేను మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను వచ్చేసావ్ కదా ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందంటే ఏదైనా సాధించవచ్చు అన్నంతా హ్యాపీగా ఉంది. దానికి శ్వేత ఏం చేయాలో తెలియక పీటర్ ని దీర్ఘంగా చూస్తూ ఉండిపోతుంది. తర్వాత అన్ని విషయాలు కూర్చొని ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటారు తర్వాత శ్వేత వాళ్ల ఇంటికి వెళ్లి పోతుంది. తర్వాత ఇంటికి వెళ్ళి మనసులో గట్టిగా నవ్వుకుంటుంది. తర్వాత రోజు శ్వేతా పీటర్ ని కలవడం మొదలు పెడుతుంది. రోజా తనతో సరదాగా మాట్లాడుతుంది అన్ని విషయాలను తనతో షేర్ చేసుకుంటుంది జాఫర్ ని లవ్ చేసిన విషయాలు కూడా. అలా శ్వేత పీటర్ తో ఫ్రెండ్ షిప్ ని మొదలు పెడుతుంది. పీటర్ కూడా బాధ నుంచి సంతోషం లోకి వస్తాడు నవ్వడం మొదలు పెడతాడు. అలా శ్వేత పీటర్ తో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల జాఫర్ ని మర్చిపోతుంది. కొన్ని రోజుల తర్వాత పీటర్ బర్త్ డే జరుగుతుంది. ఆ ముందు రోజు నైట్ 12 క్లాక్ కి కాల్ చేసి పీటర్ కి బర్తడే విషెస్ చెప్తుంది. ఆరోజు మార్నింగ్ పీటర్ ను కలుస్తుంది. కలిసి ఇలా చెప్తుంది "పీటర్ ఐ లవ్ యు పీటర్. అవును పీటర్ నిజమే నువ్వు విన్నది. నేను బాధలో ఉన్నప్పుడు నాకు సంతోషాన్ని ఇచ్చింది నువ్వే. జాఫర్ కాదనడం వల్ల నేను చాలా బాధపడ్డాను కానీ ఆ బాధ నుండి నువ్వు ఇచ్చిన సంతోషం వాళ్లే బయటపడ్డాను. ఒక్క మాటలో చెప్పాలంటే ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్న లోకోక్తి ఎంత నిజమో తన నుండి వచ్చే బాధని నీ నుండి వచ్చే సంతోషంతోనే తీయగలిగాను అన్నది అంతే నిజం. అందుకే నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను."అని శ్వేత అనే సరికి పీటర్ మొఖం ఆనందంతో వెలిగిపోతుంది. శ్వేత దానికి నువ్వేమంటావ్ పీటర్ అంటుంది. పీటర్ కి ముందు నుండి ప్రేమ ఉంది కాబట్టి ఒప్పుకుంటాడు. ఆరోజు పీటర్ బర్త్ డే కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు. 


        తర్వాత రోజు పీటర్ శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడు శ్వేత వాళ్ళ నాన్న గారు ఎవరు బాబు నువ్వు ఎవరు కావాలి అని అడుగుతాడు. నీ కూతుర్ని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అండి అని చెప్పాడు పీటర్. దానికి వాళ్ళ నాన్న చాలా కోపంగా" ఎవడ్రా నువ్వు? ఏ కులం రా నువ్వు? మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? అలాగే నువ్వు ఏం జాబ్ చేస్తున్నావ్ రా? "అని పీటర్ ని గట్టిగా అడుగుతారు. వాటిలో పీటర్ దగ్గర ఒక్క దానికి సమాధానం లేదు. అందువల్ల సైలెంట్ గా ఉండిపోతాడు. అక్కడ నుండి పీటర్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. పీటర్ ఆ రోజు రాత్రి దీర్ఘంగా కూర్చుని ఆలోచిస్తాడు. తరువాత రోజు నుండి పీటర్ చదవడం మొదలు పెడతాడు. మూడు సంవత్సరాల తరువాత పుస్తకం తీయడం వలన మొదటలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవుతాడు. చాలా రోజులు తరువాత పుస్తకం తీయడం వలన చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంటుంది. అలా వాటిని బరిస్తూ కష్టపడి తన ప్రేమ కోసం ఇష్టంగా చదువుతాడు. అలా రోజుకి ఆరు గంటలు చదువుతాడు. చివరికి ఒక ఒక సంవత్సరం తరువాత చిన్న ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ తర్వాత శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ల ఇంట్లో కూర్చుని వాళ్ళ నాన్న గారు తో మాట్లాడుతాడు. సార్ నేను మీ కూతుర్ని ప్రేమిస్తున్నాను నాకు ఒక చిన్న ఉద్యోగం కూడా ఉంది. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి శ్వేతా వాళ్ళ నాన్నగారు అంగీకరించరు. ఎట్టిపరిస్థితుల్లోనూ నీకు నా అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం జరగదు. నీది ఏ కులం రా? అని అడుగుతారు.. అప్పుడు శ్వేత "నాన్న నేను తనని ప్రేమిస్తున్నాను తనని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను" అని చెప్తుంది. దానికి వల్ల అమ్మ గారు కూడా ఒప్పుకుంటారు. వాళ్ళ నాన్నగారు కొంత సేపు దీర్ఘంగా ఆలోచిస్తారు. చేసేదేమీ లేక శ్వేత ని పీటర్ కి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇంకా వాళ్ళందరూ హ్యాపీ. పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు.పీటర్ బాధ్యతగా ఉండి శ్వేత ని సంతోషంగా చూసుకుంటాడు.ఇంకా జాఫర్ ఒక రెండు సంవత్సరాల తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకుని వాళ్ల తల్లిదండ్రులును హ్యాపీగా చూసుకుంటాడు. 


     ఇది పవిత్రమైన తొలి ప్రేమ కథ 


ఈ రోజుల్లో నిజమైన ప్రేమని గెలవాలంటే చాలా కావాలి. అవి ఏమిటంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం.. పీటర్ కి శ్వేత మీద నమ్మకం ఎప్పటికైనా వస్తుందని,శ్వేత కి పీటర్ మీద నమ్మకం తన జాబ్ తెచ్చుకొని వస్తాడని.. కుల మతాలనీ గెలవాలి. శ్వేత హిందూ మతం, పీటర్ క్రైస్తవ మతం, జాఫర్ ముస్లిం మతం.. నిజమైన ప్రేమకి మతాలు అడ్డురావు. పెద్దలని ఎదిరించాలి. తప్పదు అని టైం లో కాకుండా తప్పకుండా అనే టైంలో ఎదిరించాలి అలా శ్వేత చేసింది కాబట్టి తన ప్రేమ గెలిచింది. నిజమైన ప్రేమను గెలవాలంటే ఫ్రెండ్స్ మాటలు నమ్మకూడదు. అలానే కదా పీటర్ రమ్య మాటలు నమ్మలేదు. వీటన్నిటి కంటే ముఖ్యమైనది వేచి చూడాలి ఎంతకాలమైనా వేచి ఉండాలి అలానే కదా మూడు సంవత్సరాలు వెయిట్ చేసాడు పీటర్. 


 TRUE LOVE ALWAYS WORTH THE WAIT


ఒక నిజమైన స్వచ్ఛమైన ప్రేమని గెలవాలి అంటే ఇన్ని గెలవాలి ఇదే ఈ కథ సారాంశం.


   Tquuu all Who reads this story🙏😊

    


Rate this content
Log in

Similar telugu story from Romance