మనసంతా నువ్వే....
మనసంతా నువ్వే....
మనసంతా నువ్వే....
ఎన్నో ఆలోచనలు..
అవన్నీ నీ వైపుకే నన్ను లాగుతున్నాయి.
ఈ అనుభూతి కొత్తగా ఉంది.
నిన్ను తలుచుకున్న ప్రతిసారీ నా తనువు
పులకరిస్తుంది.
ఇదంతా నువ్వు చేస్తున్న మాయే నేమో..
అని అనుకుంటూ మురిసిపోతున్న నన్ను,
ప్రియా.. అని అమ్మ పిలుపు మళ్లీ నన్ను
ఈలోకానికి వచ్చేలా చేసింది.
నన్ను ప్రేమ మైకంలో పడేసిన
నా కలల రాకుమారుడు ఎవరో కాదు
ప్రణవ్... నా బావ.
తనని సుభద్ర అత్తయ్య పెళ్లిలో చూశాను.
అప్పటి నుండి ఇలా అయిపోయాను...
రేపు శాంతి పిన్ని ఫంక్షన్కి బావ
వస్తున్నాడు.
ఎలాగైనా నా మనసులో మాట చెప్పాలి.
మరుసటి రోజు....
బావా వచ్చినట్టున్నాడు....
ఇప్పుడెలా???!!!
ఎలా చెప్పను??!!!
ఒప్పుకుంటాడా???!!!
నా కల నెరవేరేనా???!!!
ఏం చేయను???!!!
సరే వెళ్లి చెప్తాను.
ఇలా ఎన్నాళ్లు???!!
ఇప్పటికే మూడేళ్లు
అయిపోయింది.
ఇక చాలు...
నా ప్రేమను బావకు చెపేస్తా...
అడుగులు బలవంతంగా వేస్తూ...
బావ వైపు కి వెళ్తున్నాను.
అంతా నిశ్శబ్దంగా ఉంది.
నా గుండె చప్పుడు నాకు వినపడుతూ ఉంది..
గొంతెత్తి బావ అని పిలిచాను.
కనులు కనులు కలిసిన వేళ మనసులో మాటలన్నీ
కళ్ళు మాట్లాడుకున్నాయి.
బావ మనసులో భావాలన్నీ
మా పెళ్లి శుభలేఖ గా మారాయి.
అలా మా ప్రేమ ప్రయాణం
మరో కొత్త లోకానికి దారి తీస్తుంది....
మీరందరూ మమ్మల్ని
దీవిస్తారు అని ఆశిస్తూ.....
ప్రియా ప్రణయ్

