మిణుగురులు
మిణుగురులు
అమ్మా అమ్మా మనం ఇవాళ రాత్రికి తోటకి వెళదామ అని ఆత్రంగా అడిగింది పదేళ్ల చిన్ని.
తోటకా ఎందుకురా చిన్ని అడిగింది మనస్విని.
అమ్మా మరేమో నా ఫ్రెండ్ బాలు ఉన్నాడు కదా వాడు నిన్న తోటకి వెళ్ళాడంట, అక్కడ ఆకాశంలో ఎగిరే లైటు పురుగులు చూశాడట ఎన్ని ఉన్నాయో అని చెప్పాడు మనము వెళ్లి చూద్దాం అమ్మా అంది గారాభాంగా.
లైటు పురుగుల అవేంటి అని ఆలోచిస్తూ ఓ మిణుగురుపురుగులా...
సరే రాత్రికి వెళదాం మన తోటలో కూడా రాత్రి అయితే చాలా ఉంటాయి.
రాత్రి...
ఒక పక్కకి నేల మీదకి ఆకాశానికి మధ్యలో ఎగురుతూ నేల మీదికి అతి దగ్గరగా వచ్చేసినట్టు ఉన్న చాలా మిణుగురులను చూసి...
అబ్బా ఎన్ని లైటు పురుగులో చీకట్లో బలే మెరుస్తున్నాయి మిణుకు మిణుకు మంటూ ఆగి ఆగి వెలుగుతున్నాయి కదా సంతోషంగా గంతులు వేస్తూ అంది చిన్ని.
అవి లైటు పురుగులు కాదమ్మా వాటిని మిణుగురు పురుగులు అంటారు అంది మనస్విని.
అవును అమ్మా అవి ఆకాశంలో పక్షులు లాగా ఎగురుతున్నాయి కదా మరి వాటిని పక్షులు అనకుండా పురుగులు అంటున్నారు ఏంటి అడిగింది చిన్ని.
కూతురు అడిగిన ప్రశ్నకు నవ్వు వచ్చింది,
చిన్నప్పుడు తనకి కూడా అలాంటి అనుమానమే వచ్చింది. కానీ అప్పుడు దానికి సమాధానం తెలీదు.
ఇప్పుడు చిన్నికి ఏం చెప్పాల అని ఆలోచించి చెప్పింది.
అవి చిన్నగా పురుగుల సైజులో ఉన్నాయి కాబట్టి పురుగులు అంటారు అంది.
అమ్మా అమ్మా మనం వాటిని పట్టుకుందాం అమ్మా ఒక్కటి నాకు పట్టివ్వు అంది చిన్ని.
అయ్యో వద్దు చిన్ని వాటిని మనం పట్టుకోలేం అంది మనస్విని.
ఊ..ఊ.. అమ్మా ఒక్కసారే పట్టుకుని వదిలేద్దాం పట్టుకో అమ్మా.
అరే చిన్ని అవి పట్టుకుంటే కాలుతుంది నాన్న మనం పట్టుకోలేం.
ఎందుకు పట్టుకోలేం మొన్న ఒక సినిమాలో ఆ అకుంల్ పట్టుకున్నాడు నేను చూసా అంది చిన్ని.
అలా పట్టుకున్నారు అంటే అవి డూప్లికేట్ వి ఇవి కావు
నిజంగానే మనం పట్టుకోలేం నా చిన్నప్పుడు నేను ఇలాగే పట్టుకుందాం అని ప్రయత్నం చేసి పట్టుకున్నా.
నా చేయి బాగా కాలి తోలు ఊడి వచ్చింది. అది పట్టుకున్నంత వరకు చేయి ఎర్రగా కాలి భయంకరమైన మంట వెంటనే వదిలేసా అంది మనస్విని.
అవునా అమ్మా.
నిజం చిన్ని మనం వాటిని దూరంగా ఉండి చూడాలి తప్ప పట్టుకోవాలి అని చూడకూడదు..
పట్టుకుంటే కాలుతుంది అని స్వీయానుభవంతో చెప్పింది మనస్విని.
నిజంగానే...
చాలా మందికి తెలీదు.
అందంగా ఉండే మిణుగురు పురుగులను తేలికగా పట్టుకోవచ్చు అనుకుంటారు కానీ...
నిజంగానే మిణుగురుపురుగుల్లో వెలుగులా ఉండేది అగ్ని, అది వేడిగా ఉండి నిప్పులా కాలి మండుతూ ఉంటుంది.
మనం పట్టుకుంటే కాలుతుంది, మంట పెడుతుంది,చర్మం ఊడి వస్తుంది.
ఒక సెకను కూడా పట్టుకోలేం.
కొన్ని... అందంగా ఉన్నాయని అందుకోవాలని చూడకూడదు.
దూరంగా ఉన్నంత వరకే వాటి అందం.
