STORYMIRROR

chavali krishnaveni

Classics

4  

chavali krishnaveni

Classics

శుభోదయము

శుభోదయము

1 min
328

జయగురుదత్త 🕉️🙏🕉️శుభోదయం


సీ.

పెద్దవెల్గుండగా పెంజీక టావల

....పోల్చనైతిని నిన్ను పోల్చనైతి

నరుణోదయపు వెల్గు హారతు లెత్తినా

....తెరచాటు తలపులు తీయనైతి

చిరుగాలి తెమ్మెరల్ చెన్నుగ తాకినన్

....గురుతించ కుంటినే కూర్మి లేక

సెలయేటి గలగలల్ చెంగావి వల్వలన్

....నీ వర్ణమనుమాట నేఱ నైతి


తేటగీతి.

పంచ భూతాత్మకుడ నీదు ప్రాభవమును

మాయ లో చిక్కి మఱచిన మానవుడను

వెర్రి వాడనై నిన్నెంత వెదకినాడ

రెండవది లేదని గురుతు లేనివాడ.


_చావలి బాలకృష్ణవేణి

28..2..23


Rate this content
Log in

Similar telugu poem from Classics