శ్రీనివాస
శ్రీనివాస
ॐॐॐ
श्री गुरूभ्योनमः
श्रीमात्रेनमः।
🍁🌷🍁🌷🍁🌷🍁🌷🍁🌷🍁🌷🍁🌷
*నినుగని మురిసెద తిరుమల వరదుడ*!! 🙏
*నినుగని* యెంతమంది ప్రతి నిత్యము పాపపు రాశివీఁడగా
నినుగని యెంతమంది తమ నిక్కము ప్రేమను దెల్పుచుందురో
నినుగని యెంతమందియు వినీతులు నయ్యిరొ శ్రీ నివాసుడా!
నినుగని నే తరింతునయ నిశ్చల తేజుడ పద్మరాగమా!!
*మురిసెద* నీదు చెంత కని మూలవిరాట్టుగ శాస్త్ర సన్నుతా
మురిసెద నిత్య మంగళ సమూహ ప్రమోద వివాహ తంతునన్
మురిసెద జూఁసి వేఁడుకను భోగపరాయణ నారసింహుడా
మురిసెద లక్ష్మి చెంత నిను ముద్దుగ నుండగ తన్మయంబుతోన్!!
*తిరుమల* రాయుడయ్యరొ! ప్రతీదినంబున గొల్చుచుంటి నీ
తిరుమల వచ్చి మ్రొక్కులను దీర్పగ నిచ్ఛ విరాళి యుండగాన్
తిరుమలలోని పూవుగల తీగను నైన ను చాలు ధన్యతన్
తిరుమల నాకమైయలర తిన్నగ నీదరి చేరనీయరా!!
*వరదుడ* వీవు మంగపతివై చెలగంగ ప్రమోదమాయనే
వరదుడ వందురే నిను శుభంబుల నిచ్చె డి వేంకటేశ్వరా!
వరదుడవై యిలన్ వెలసి భావి సుభిక్షముజేయ బూనగా
వరదుడ! నమ్ముకుంటినను పాలను ముంచర మోక్ష మీయు చున్!!
✍️చావలి బాలకృష్ణవేణి
1::03::'23
