పాఠం...
పాఠం...


బడి నేర్పిన నీతీ
చిన్నప్పుడు పెన్సిల్ ఇస్తారు,
తప్పు చేస్తే చెరుపుకునే
అవకాశం ఉంటుంది
కొంచం పెద్ద అయ్యాక పెన్ ఇస్తారు,
తప్పులు చెయ్యొద్దు అని చెప్పడానికి.
ముందు గీతల పుస్తకం ఇస్తారు,
ఒక వరుసలో రాసుకోవచ్చు.
కొంత పెద్ద అయ్యాక
తెల్ల కాగితలు ఉండే పుస్తకం ఇస్తారు,
నీ దారి నువ్వే ఎంచుకో అని,
సరైన దారిలో వెళ్ళమని.