STORYMIRROR

kondapalli uday Kiran

Children Stories Drama Inspirational

4  

kondapalli uday Kiran

Children Stories Drama Inspirational

గుణపాఠం.

గుణపాఠం.

1 min
255


సోంపేట అనే గ్రామంలో సర్కస్ జరుగుతుంది. నక్క, పులి రెండూ చూడటానికి వెళ్తున్నాయి. దారిలో ఈగ కనిపించింది. ఈగ "పులిరాజా! నన్ను కూడా తీసుకెళ్తారా!అని అడిగింది?.పులి,నువ్వా! నీ ఆకారం ఎంత? నువ్వెంత? నా అంత కండబలం కూడా నీకు లేదు! అక్కడికి నాలాంటి ధైర్యవంతులు మాత్రమే వస్తారు" అని పులి వెక్కిరించింది. ఈగకు చాలా బాధేసింది. అలా వెళ్తుండగా పులికి ఒక ఎలుగుబంటి ఎదురైంది. ఎలుగుబంటి కోపంతో పులి మీదకి దూకింది. పులి భయంతో! చెట్టు మీదకు ఎక్కింది.నక్క కూడా భయంతో పరుగుతీసింది. అప్పుడే అక్కడికి ఈగ వచ్చి" దమ్ముంటే నాతో

పోట్లాడు" అని చెప్పింది. "ఆ సరే రా!"అంటూ ఎలుగుబంటి ఈగ మీదకు ఒక్క సారిగా దూసుకెళ్లింది. ఈగ తన తెలివితో ఎలుగుబంటి ముక్కులోకి, చెవిలోకి, దూరి నానా తిప్పలు పెట్టింది. దెబ్బకు ఎలుగుబంటి బాధ భరించలేక వెళ్ళిపోయింది. పులి కిందకు దిగింది. "మిత్రమా! నన్ను క్షమించు. నిన్ను వెక్కిరించాను. ఆకారంలో చిన్నదాని వైనా తెలివితో మమ్మల్ని కాపాడావు. "కండ బలము కన్నా బుద్ధి బలము గొప్పది"అనే గుణపాఠాన్ని నేర్పావు" అని చెప్పింది. ఈగ ఏమీ మనసులో పెట్టుకోకుండా పులిని క్షమించింది. తర్వాత ముగ్గురు కలిసి సర్కస్ కి వెళ్లి ఆనందంగా గడిపారు.


Rate this content
Log in