ఎందరో వీరులు అందరికి వందనాలు
ఎందరో వీరులు అందరికి వందనాలు
రోజువారి పనులతో అలసిపోయి రాత్రిపూట నిద్ర పోతున్న ప్రతిసారి ఆ తీరే అలసట అనేది మానసికంగా అలాగే శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. నిద్ర అనేది అందరికి అవసరం. కాని దేశానికి సేవ చేసే సైనికులు మాత్రం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండ దేశ రక్షణకి కృషి చేస్తున్నారు. మంచు కురిసే చలిలో అయినా నిప్పులు కక్కే ఎండలో అయినా కుండపోత వానలో అయినా ఇవి ఏవి కూడా వారు పట్టించుకోకుండా శత్రుదేశాల నుండి మన దేశానికి రక్షణ కల్పిస్తారు. అందుకే అంటారు దేశానికి వెన్నుముక ఒకరు రైతు అయితే ఇంకొకరు సైనికుడు.
