t. s.

Children Stories Inspirational

4  

t. s.

Children Stories Inspirational

బాహుబలి

బాహుబలి

2 mins
476


వీరమల్లు ప్రతిసారి మల్లయుద్ధం పోటీలో మొదటి స్థానంలో గెలిచి రామాపురం ఊరికి గొప్ప పేరు తెచ్చేవాడు.


ఎంతటి వాళ్ళయినా వీరమల్లు ముందు మల్లయుధ్ధంలో ఓడిపోవాల్సిందే.


చిన్నప్పటి నుంచి మల్లయుధ్ధంలో భుజ బలాలు అతిగా చూపడం వల్ల ఎంతటి బరువులైన అవలీలగా మోయడం వల్ల ఊరంతా కలిసి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు వీరమల్లు గురించి.


అందరూ మెచ్చుకోవడం వల్ల వీరమల్లుకి బాగా గర్వం పెరిగి, అందరితో పొగరుగా మాట్లాడటం మొదలు పెట్టాడు. 

పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని లెక్క చేయకుండా,

నాకు ఎవరూ ఎదురు లేరని విర్రవీగసాగాడు.


అతని పిచ్చి పొగరుతో ఊరివాళ్ళకి బాగా కోపం వచ్చింది.

ఎలా అతని పొగరు అణచాల అని సమయం కోసం ఎదురు చూడసాగారు.

ఒకసారి పట్నంలో స్థిరపడిన ఆ ఊరి వాడైన బాహుబలి ఆ ఊరికి వచ్చాడు.

అందరి నోట వీరమల్లు గురించి విని ఎలా అయినా వీరమల్లుకి బుద్ధి చెప్పాలనుకుని ఒక ఆలోచన వచ్చి ఊరందంరీకీ చెప్పాడు.

వీరమల్లు చర్యల వల్ల విసిగిపోయిన ఊరంతా సరే అని ఒప్పుకున్నారు.


ప్రణాళిక ప్రకారం ఊరంతా చాటింపు వేశారు.

ఊరి చివర ఉన్న పెద్ద బండని బాహుబలి రెండు చేతులతో పైకి లేపే ప్రయత్నం చేస్తున్నాడని.

ఊరి వాళ్ళందరూ అక్కడికి వెళుతుంటే వీరమల్లు ఆశ్చర్యంగా ఏంటి ఆ బక్క బాహుబలి ఆ బండని లేపుతున్నాడ ఇది నమ్మి ఈ పిచ్చి జనం పరుగెడుతున్నార అని హేళనగా నవ్వడం మొదలెట్టాడు.


చిన్న కొండలాగ ఉండే ఆ బండకి ఒక చరిత్ర ఉంది.

పూర్వ కాలంలో ఆ ఊరి వాళ్ళ తాత ముత్తాతలు ఆ బండని లేపి ఒకరి తర్వాత ఒకరు తమ బలబలాలు చూసుకునే వారని ఒక కథ ఉండేది.

కానీ ఈ తరంలో దాన్ని లేపడం ఎవరూ చూడలేదు.

ఇప్పుడు అది బాహుబలి లేపబోతున్నాడు.

ఊరంతా వెళ్ళేసరికి ఆగలేక వీరమల్లు కూడా వెళ్ళాడు అక్కడికి.


ఊరంతా అక్కడికి చేరాక బాహుబలి రెండు చేతులతో బండని క్రింద నుంచి పైకి లేపుతున్నట్టు నాటకం మొదలుపెట్టాడు. ఖాళీ చేతులతో పెద్ద బరువును మోస్తున్నట్టు అరుస్తూ రెండు ఖాళీ చేతులు ఎంతో బరువును మోస్తున్నట్టు ముఖ కవలికలు పెడుతూ లేపాడు.


ఊరందరూ ముందే అనుకోవడం వల్ల అరే బలే ఎత్తుతున్నాడురా అని అంత పైకి ఎలా ఎత్తాడని అంటుంటే వీరమల్లు ఆశ్చర్యంగా ఎక్కడ ఎత్తాడు ఆ బండ క్రిందనే ఉందిగా అన్నాడు.

అక్కడ ఉన్నవాళ్ళంతా అదేంటి అంత పైకి ఎత్తి పట్టుకుని ఉంటే అన్నారు.

వీరమల్లు అదేంటి ఎక్కడ బండ అక్కడ క్రిందనే ఉంది మీ కళ్ళు కాకులెత్తుకెళ్ళాయ అని గొడవ పెడుతుంటే ఊరిలో ఒకడు ఎత్తలేదంటావేంటి నీకు బాహుబలి ఆ బండని ఎత్తాడని అసూయతో అలా అంటున్నావు ఊరందంరీకీ కనిపిస్తుంది నీకు కనిపించలేదంటే నీ కళ్ళకి ఏమన్నా అయిందేమో అన్నాడు.

ఇంతలో బాహుబలి ఆ బండని క్రింద పెడుతున్నట్టు నాటకం ఆడుతూ రెండు చేతులు క్రిందకి దించాడు.

ఊరి వాళ్ళందరూ బాహుబలిని మెచ్చుకోవడం చూసి,

వెంటనే బాహుబలి నిజంగానే ఊరందంరీకీ బండని ఎత్తినట్టు కనిపిస్తుంది అంటే నిజంగా ఎత్తినట్టే ఉంది.

వాడేన ఎత్తేది బక్కగున్న వాడికంటే బలంగా ఉన్న నేను ఆ బండని మోయగలను అనుకున్నాడు.

అని వెంటనే అందరికీ చెప్పాడు నేను కూడా ఆ బండని పైకి లేపుతానని.

అనడమే ఆలస్యం వెళ్ళి బండను లేపడానికి చూశాడు.

ఉహు బండ చిన్న కొండాయే ఎలా కదులుతుంది ఎంత బలవంతుడికైనా, 

కొంచం కూడా కదలలేదు.

ఎంత ప్రయత్నం చేసినా బండ కదలకపోయేసరికి వీరమల్లు గర్వం తగ్గిపోయింది, 

ఊరి వాళ్ళందరి ముందు తల వంచుకుని నిలబడ్డాడు.


ఎంతటి బలవంతుడైన బుద్ధి బలం లేకపోతే వ్యర్థమే.

వీరమల్లుకి ఎప్పటికి అర్థం కానిదేంటంటే ఆ బండని బక్క బాహుబలి ఎలా లేపాడనేది.


అసలు లేపని బండని లేపాడు అని ఊరందరితో అనిపించుకున్న బాహుబలి బుద్ధికి తోడు ఊరందరి సహకారం తోడయింది కాబట్టి.

బాహుబలి ఊరివాళ్ళకి ముందే చెప్పాడు ఈ నాటకం గురించి, ఆ బండని లేపకపోయిన లేపినట్టు ఊరి వాళ్ళందరూ బండని లేపినట్టు చూడాలని.


ఇది వీరమల్లుకి ఎప్పటికి అర్థం కానీ ప్రశ్నే.



Rate this content
Log in