STORYMIRROR

Dinakar Reddy

Children Stories Inspirational Children

4  

Dinakar Reddy

Children Stories Inspirational Children

ఉంగా ఉంగా..

ఉంగా ఉంగా..

1 min
280

మది సంతసంబున

వేల పూవుల రెక్కలు విచ్చుకున్నట్లు

పసి పాప చిన్ని కన్నులు

తెరిచీ తెరువనట్లు


దోమ తెర వెనుక తల్లి ఎక్కడ ఉన్నదో అని

కదలడానికి ప్రయత్నించి

ఇక సాధ్యపడక


ఉంగా ఉంగా అని

అమృత మాధురి కలిపిన శబ్దము సేయ

అచ్చెరు వొంది

బిడ్డను గుండెకు హత్తుకుని

పాలిచ్చి మరిపించు తల్లికి

ఆ బిడ్డ సేయు శబ్దములు


వేల గాయకులు

బిళహరి, సింధు భైరవి రాగాలలో 

సాగించు ఆలాపనల కన్నా మిన్నయే కదా


పాలు తాగిన తరువాత

దిష్టి తీసి

చిన్ని నీ బొజ్జకు శ్రీరామ రక్షయని

తల్లి సేయు ఆశీర్వాదము

భగవంతుని సైతము మురిపించునే

అట్టి మాతృత్వమునకు నమస్సుమాంజలి..



Rate this content
Log in