STORYMIRROR

Midhun babu

Children Stories Fantasy Children

4  

Midhun babu

Children Stories Fantasy Children

తల్లి ప్రేమ

తల్లి ప్రేమ

1 min
3


తల్లికన్నగొప్ప ధరణినందునులేరు

కడుపునందుమోసు కన్నవరకు

పురిటిబాధలెల్ల భరియించు ఓర్పుగ

తనకుసంతుకొరకు తప్పదనుచు


తల్లిసేవనీకు తగినకర్తవ్యంబు

విధిని నిర్వహించు విడువకుండ

తిన్నతినకయున్న తినిపించు సంతుకు

మాతయొక్కవిలువ మరువతగదు


ఉగ్గుపాలతోను ఉదరంబు నింపును

నియమమెరిగి కడుపు నింపుచుండు

ఊయలందువేసి ఊపి నిదురపుచ్చు

సంతసించుచుండు సంతుచూసి


చందమామ పాట చక్కగా పాడుతు

గోరుముద్దపెట్టి నోరునింపు

పొంగిపోవుచుండు పుత్రుని యాడించి

పసిడిపిల్లవాడు ప్రాణమనుచు


కన్నతల్లి మరియు కనినట్టిభూమిని

మదిననిలుపుమెపుడు మరువకుండ

మంచిచేయువారి నెంచిచూడుమెపుడు

తగినసేవచేయి తప్పకుండ



Rate this content
Log in