STORYMIRROR

Midhun babu

Children Stories Fantasy Children

3  

Midhun babu

Children Stories Fantasy Children

పసిమనసుల

పసిమనసుల

1 min
5


పసి మనసుల పరిమళాలు విరబూయుట చిత్రమే1.

మానవత్వ సుగంధాలు విరజిమ్ముట చిత్రమే!


పసికూనల రక్షణకై పత్రఛత్రి ఎత్తెనేమొ!

మదితోటలొ సమభావం జనియించుట చిత్రమే!


పేద ధనిక తారతమ్య భేదములన ఎందుకు..?

క్షణభంగుర జీవితాన్ని...విభజించుట చిత్రమే!.


చితికిన బతుకుల దారిని సుగమముగా చేయుమా!

బాల్యమంటి స్వఛ్ఛతయే మసిబారుట చిత్రమే


సంతోషం సగం బలం..సంతృప్తియె పూర్ణ ఫలం.

స్వార్ధ పడగ నీడలోన పరుగెత్తుట చిత్రమే!..



Rate this content
Log in