పడవలో ఆటలు
పడవలో ఆటలు
ఓ చిన్న సరస్సు
అంచు వెంబడి పచ్చని చెట్లు
గరిక మీద నుంచి వీస్తూ
నీటిని కదిలించే పిల్లగాలి
గాలితో పోటీగా
అక్కడికి వచ్చే పిల్లలు
చిన్న చిన్న పడవలు
పడవలో ఆటలు
తెచ్చుకున్న తినుబండారాలు
లేలేత సూర్య కిరణాలు
ఆకులు పడుతూ చేసే చిన్న శబ్దాలు
చేపలు పట్టడానికి వచ్చే వాళ్ళు
వాళ్ళని చూస్తూ చప్పట్లు కొట్టే పిల్లలు
ఆటల్లో అలసి
పచ్చికలో పొర్లుతూ
పడవలో విహరించి
కాసేపు చెట్ల కింద నిద్రపోయి
మధ్యాహ్న సమయానికి ఇల్లు చేరడం
ఈ వేసవిలో
ఇంత కన్నా గొప్ప అనుభూతి
ఎక్కడ దొరుకుతుంది
సమయం ఖర్చు చేస్తే చాలు
బోలెడు ఆనందం సొంతం..
