నవ సమాజం కోసం.....
నవ సమాజం కోసం.....
సమ సమాజం కోసం.....
మత మౌడ్య రంగం మందు
ప్రతి పౌరుడొక వీరుడై పోరాడాలి
శాస్త్రీయ దృక్పధంతో మునుముందుకు సాగాలి
నూతన మనిషి అవిర్బవానికి
సమత, మమతల సమాజానికి
అడ్డుగా నిలిచిన ఏ గోడలనైన బ్రద్దలు గొట్టాలి
వర్ణ, కుల, జాతి, మత వివక్షల్ని కడిగిపారేయ్యాలి
అవసరమైతే అడ్డొస్తే
ఆశాస్త్రీయ దేవాలయాలను పడగొడుదాం
ఆశాస్త్రీయ చర్చిలను కులగొడుదాం
ఆశాస్త్రీయ మసీదులను మట్టికరిపిద్దాం
లేదంటే మల్లి ఆదిమ కాలానికే తీసుకెళ్లే
ఆశాస్త్రీయ అవతార పురుషులని అంతమొందిద్దాం
కులం కంపుతో .....
......
మన మనసులను మైల పరిచిన
ధర్మం పేరుతో ..........
మన మానవత్వాన్ని నిలిపివేసిన
భక్తి ముసుగులో .....
మన గుండెల నిండా మతం నింపిన
సంప్రదాయాలతో.....
మన సిరలలో సమానత్వాన్ని విషతుల్యం చేసిన
ఆచారాలతో........
మన ధమనులలో కులతత్వాన్ని సరఫరా చేసిన
దొంగ బాబాల, దొంగ స్వామిజీల,
దొంగ పూజారుల, దొంగ ఫాదర్ ల,
దొంగ మొల్లాల భరతం పడుదాం
మూఢ విశ్వాసాలను మంటపెడుదాం
ఆ శాస్త్రీయ శాస్త్రలను భూస్థాపితం చేద్దాం
రాజ్యాంగ బద్దంగా చట్టాలను గౌరవించి
సమ సమాజాన్ని నిర్మిద్దాం.