Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ARJUNAIAH NARRA

Children Stories Inspirational Children

4.7  

ARJUNAIAH NARRA

Children Stories Inspirational Children

ఆమె లేకుంటే....

ఆమె లేకుంటే....

1 min
469


ఆమె లేకుంటే....

అమ్మే లేకుంటే....


ఆమె ఒక మహా సముద్రం

అత్యంత విలువైన నిధులను

తన గర్భంలో దాచుకున్న మహా సముద్రం 

ఆమె ఈ ప్రపంచానికి జన్మనిచ్చింది

ఈ ప్రపంచాన్ని ప్రేమించింది

అందుకే దానిని అందంగా తీర్చిదిద్దుతుంది


ఆమె.....

మన కంటికి ఒక నలుసైతే

ఆమె గర్భానికి మనం ఒక నలుసే


ఆమె......

మన కండ బలం ముందు బలహీనురాలే

కానీ ఇంత బలాఢ్యులని కన్నది ఆమె


ఆమె........

మనల్ని కని ఈ దేశాన్ని కాపాడే 

యుద్ధ వీరులను కఠోర శ్రమతో 

సంరక్షించిన వీర వనిత


ఆమె.......

మనల్ని కని రోగాలనుండి రక్షించి

మృత్యువును ఎదిరించే వైద్యులకు

శిక్షణను ఇచ్చింది 


ఆమె.........

మనల్ని కనిపెంచి ఓ కంట కనిపెట్టి

మనకు కనిపించనిది కనిపెట్టే

శాస్త్రవేత్తలను చేసింది 


ఆమె.........

మనల్ని కని బుద్దులను నేర్పి

విద్యాబుద్దులను నేర్పే 

గురువులను ప్రసాదించింది 


ఆమె......

మనల్ని కని మనతో ఆటలాడి

ఎంతో నైపుణ్యం ఉన్న క్రీడాకారులని

మైదానానికి పంపించింది


ఆమె.....

మనల్ని కని మనకు సంగీత స్వరాలు

సమకూర్చి మనల్ని గాయకులని చేసింది.


ఆమె...

మనల్ని కని మనకు పాలిచ్చి పెంచి

ఈ దేశాన్ని పాలించే నేతలను 

మనకందించింది


ఆమె లేకుండా ........

ఈ నిపుణులను ఎవరు తయారు చేయగలరు

ఈ నాయకులను ఎవరు పుట్టించగలరు

ఈ ప్రపంచాన్ని ఎవరు నడపగలరు

ఆమె స్వీయ త్యాగం లేకుంటే 

మనం లేము....


ఆమె అమయకురాలే.......

కానీ ఆమోఘమైన నిపుణులను 

తయారు చేసినా కర్మగారమే ఆమె గర్భం 


ఆమె గర్భం........

ఆకాశమంత అనంతం

మహా సముద్రమంత మర్మం


అందుకే ఆమె.....

ఈ ప్రకృతిలో జీవపరిణామా 

క్రమానికి ఒక మూలం.

ప్రకృతికి పర్యాయపదం


గమనిక. 

ముఖ చిత్రం నర్ర సుగుణమ్మ, మా అమ్మగారు. 

మా నాన్నగారు 2008 లో పరమపదించారు.

మేము ఐదుగురం అన్నదమ్ములం. మా అమ్మగారు

నిరక్షరాస్యురాలు కానీ మమ్ములను పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వరకు చదివించింది. ఆమె 2004 లో క్యాన్సర్ బారినా పడి దాదాపుగా ఇరువది సంవత్సరాల నుండి పోరాడుతూ గెలుస్తునే ఉంది. మా అమ్మే మాకు ప్రేరణ, మరియు ఆదర్శం.



Rate this content
Log in