STORYMIRROR

ARJUNAIAH NARRA

Children Stories Classics Inspirational

3  

ARJUNAIAH NARRA

Children Stories Classics Inspirational

భారత్ స్వేచ్ఛ ప్రతిమ

భారత్ స్వేచ్ఛ ప్రతిమ

1 min
40


భారత్ స్వేచ్ఛ ప్రతిమ


అదిగో చూడూ అదిగదిగో చూడు

ఇంతయై అంతయై నీలాకాశమంతయై

హైదరాబాద్ నందు 125 

అడుగుల ఎత్తులో ......

The Statue of Liberty in India

"సకల జనుల సమతమూర్తి" ఉదయించాడు


హుస్సేన్ సాగర్ ఒడ్డున 

బుద్ధుడి బోధనల బడిలో

బంగారు తెలంగాణ ఒడిలో

తాడిత పీడిత నిమ్నవర్గాల 

ఆరాధ్యదైవమైన అంబెడ్కర్ ని చూడు


ఎవరెస్టు శిఖరంలాంటి ఆత్మగౌరవాన్నీ చూడు

హిమాలయ పర్వత గాంభిర్యానీ చూడు 

పాదాల వద్ద పార్లమెంట్ లాంటి భవనాన్నీ చూడు

హిందు మహా సముద్రమంత విశాలమైన

సమానత్వ భావనను చూడు

బంగాళాఖాతమంత బహుజనుల బంధువును చూడు

అరేబియా సముద్రమంత అనాధల దేవుడిని చూడు


అణగారిన వారి హాక్కులు కాలరాయబడ్డప్పుడు

కులం పేరుతో నిన్ను దూషించినపుడు

మతం పేరుతో నిన్ను ద్వెషించినపుడు

జాతి పేరిట నిన్ను అవమానించినపుడు

వర్ణం పేరుతో నిన్ను నిందించినపుడు

రాక్షషుల చేతిలో ధర్మాన్ని రక్షించడానికి

దశ అవతారలే కాదు

ద్వాదశ అవతారాలైన ఎత్తుతాడు

ఇది కర్మభూమి సిద్ధాంతం


"జై జంబుద్వీప సర్వే జనా సుఖినో భవంతు"

జై బుద్ధ           జై పూలే 

జై పెరియర్        జై అంబెడ్కర్ 

జై భారత్          జై జంబుద్వీపం



Rate this content
Log in