STORYMIRROR

ARJUNAIAH NARRA

Children Stories Inspirational Children

4  

ARJUNAIAH NARRA

Children Stories Inspirational Children

అంబెడ్కర్ అంటే...

అంబెడ్కర్ అంటే...

1 min
446

అంబెడ్కర్ అంటే......

అంటరాని బురదలో

కమల పువ్వులా వికసించి

అక్షరాలు దిద్ది

చదువుల దేవుడయ్యాడు


అంబెడ్కర్ అంటే....

అక్షరమోక ఆయుధమై 

జ్ఞానంగా జన్మిస్తే....అది అంబెడ్కర్


అంబెడ్కర్ అంటే......

పంచముడుగా పుట్టి

చాతుర్వేదాలను ప్రశ్నించి

అక్షరాన్నీ ఆయుధంగా మలిచి

పంచమవేదంగా రాజ్యాంగాన్ని రాసినాడు


కోరిన కోరికలు తీర్చే వారు 

దేవుళ్ళు దేవతలైతే

కోరకనే కోరికలు తీర్చిన  

దేవ దేవ మహాదేవుడే 

మన అంబెడ్కర్ 


అందుకే అంబెడ్కర్....

వెలివాడల బతుకుల్లో 

వేగుచుక్కై వెలిసినాడు

అణగారిన బతుకుల్లో 

అరుణ కాంతై మెరిసినాడు

పేదల గుండెల్లో ప్రేమను పంచాడు

అనాధల పెదవుల్లో

చిరునవ్వై పూసినాడు 


అంబెడ్కర్ అంటే......

తన మేధస్సు మేరుదండతో

భారత దేశ నుదుటిపైన తలరతగా

ప్రజసౌమ్యాన్ని రాసిన బ్రహ్మ


అంబెడ్కర్ అంటే......

సర్వం నా సృష్టే అంటే

అంత నా మాయ అంటే

పుట్టుక, చావు నీ చేతుల్లో లేదంటే

జీవించే హక్కును వరంగా కల్పించినాడు


నాడు ......

అన్ని తానైనాడు

అంటరానోల్లకి శరణు అయ్యాడు

బహుజనులకు బంధువైనాడు

నేడు.....

ఈ దేశంలో శతకోటి 

దీనులకు దేవుడయ్యాడు



Rate this content
Log in