అమ్మలాలపాట
అమ్మలాలపాట
1 min
4
అమ్మ లాల లాలనలకు..తూగగల్గు ధనమెక్కడ..!
పుడమితల్లి వేదనలను..తూచగల్గు ధనమెక్కడ..!
నీరు వృథా చేస్తావేం..కన్నీళ్ళతో పనియేమి..
చిరునవ్వుల దీపాలను..నిలుపగల్గు ధనమెక్కడ..!
పొద్దు వాలిపోతుంటే..బాధెందుకు మిగులుతోంది..
ఒక్క మనసు లోనచోటు..ఇవ్వగల్గు ధనమెక్కడ..!
వెతుకులాట మధువుకొరకు..కాదులెమ్ము వెర్రితనం..
అమాయకతే నిజానికది..పట్టగల్గు ధనమెక్కడ..!
ప్రశ్నించే నిజాయితీ..నిదురించదు కలనైనా..
జవాబుగా నీ మనసును..చూపగల్గు ధనమెక్కడ..!
