Shaik Sameera

Thriller


3  

Shaik Sameera

Thriller


ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

5 mins 180 5 mins 180

              ఎపిసోడ్ -7

వంశ్ నీ సాండల్స్ పైన మట్టి ఎలా వచ్చింది అని అడుగుతాడు రిథిమాని .రిథిమా mr.VR సాండల్స్ పైన మట్టి ఉండటం మాకు నార్మల్ కానీ మీలాంటి వాళ్ళకి నార్మల్ కాదేమో అంటుంది .

వంశ్ -really సాండల్స్ పైన మట్టి ఉండటం నార్మల్ కావొచ్చు .కానీ నీ సాండల్స్ కి అంటుకొని ఉన్న ఆ మట్టి మాన్షన్ బ్యాక్ యార్డ్ లో మాత్రమే ఉంటుంది .ఇప్పుడు నువ్వు నిజం చెప్పు బ్యాక్ యార్డ్ కి ఎందుకు వచ్చావు అంటుంది .

రిథిమా ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉంటుంది .వంశ్ అమ్మ అనుప్రియ చెప్పు రిథిమా ఎందుకు వెళ్ళావు బ్యాక్ యార్డ్ కి నీకు హౌస్ రూల్స్ చెప్పాక కూడా హౌస్ రూల్స్ వచ్చిన రోజే ఎందుకు బ్రేక్ చేసావు అని అడుగుతుంది .వంశ్ పిన్ని ఏదైనా దొంగతనం చేయడానికి వెళ్ళిందేమో అంటుంది .వంశ్ బాబాయ్ ఇంట్లో all ఫ్యామిలీ మెంబర్స్ &స్టాఫ్ అందరికి తెలుసు బ్యాక్ యార్డ్ కార్నర్ వంశ్ కి ఎంత ముఖ్యమో తెలిసి ఎవరు వెళ్ళరు ఈ అమ్మాయే వెళ్లి ఉంటుంది అని అంటాడు .ఇషాని ఈ రిథిమా ఏదో చేయడానికే అక్కడికి వెళ్లి ఉంటుంది అని చెబుతుంది వంశ్ తో .రిథిమా మనసులో వంశ్ కి నేను బ్యాక్ యార్డ్ కి వెళ్ళాను అని తెలిసిపోయింది కాబట్టి నిజం చెప్పడమే బెటర్ అని చెప్పబోతుంది .వంశ్ నువ్వు చెప్పేది ఏదైనా నిజమే అవ్వాలి అబద్ధం అంటే నాకు చాలా అసహ్యం అంటాడు .

రిథిమా -నేను బ్యాక్ యార్డ్ కి వెళ్ళాను 

వంశ్ -తెలుసు కానీ ఎందుకు వెళ్ళావో చెప్పు అంటాడు .

రిథిమా ఏదో చెప్పేలోపు ఆర్యన్ వచ్చి తను నన్ను కలవడానికి వచ్చింది కానీ దారి తెలియక బ్యాక్ యార్డ్ కి వెళ్ళిపోయింది అంటాడు .రిథిమా షాక్ అవుతుంది .వంశ్ ఇది నిజమా చెప్పు అంటాడు రిథిమాతో .ఇది నిజం కాదు అంటుంది రిథిమా .ఆర్యన్ sorry baby నువ్వు మన మధ్య రిలేషన్ సీక్రెట్ గా ఉంచాలని అనుకున్నావు కానీ అందరూ నిన్ను దొంగలా చూడటం నాకు నచ్చట్లేదు అందుకే చెప్పేస్తున్నా అని రిథిమా కి నాకు మధ్య క్రూయిజ్ లోనే ఏం జరగాలో అది జరిగిపోయింది .వంశ్ అన్నయ్య రిథిమా తప్పేం లేదు నా పర్సనాలిటీ యే అంత ఏ అమ్మాయి అయిన నన్ను చూసి attaract అయిపోతుంది రిథిమా కూడా అలాగే అయింది అంటాడు .రిథిమా ఆ మాటలు విని ఏడుస్తుంది .ఇషాని చూసారా ఇది ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి బుద్ది అంటుంది .సియా రిథిమా అలాంటి అమ్మాయి కాదు రిథిమా చెప్పు ఏమైందో అంటుంది .వంశ్ నానమ్మ రిథిమా భయపడకు ఏం జరిగిందో చెప్పు అంటుంది .రిథిమా tell me the truth dam అంటాడు వంశ్ .ఆర్యన్ అన్నయ్య తనని భయపెట్టొద్దు తను ఒక సింపుల్ అమ్మాయి అని రిథిమా భుజం మీద చేయి వేయబోతాడు .రిథిమా ఆర్యన్ చెంప మీద చాచి కొడుతుంది నన్ను తాకాలని చూస్తే మర్యాదగా ఉండదు అని వేలు చూపిస్తుంది తనకి .వంశ్ interesting very interesting అయితే నీకు ఆర్యన్ కి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అంటాడు .

రిథిమా నా గురించి మీరు ఇలా ఎలా ఆలోచిస్తారు నేను ఒక అనాధని అనా .నేను మీలాగా రిచ్ కాకపోవచ్చు కానీ దానికి అర్థం నాకు క్యారెక్టర్ లేదు అని కాదు .నా దగ్గర డబ్బు లేకపోవచ్చు అంతకంటే విలువైన క్యారెక్టర్ ఉంది నాకు .నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని కావొచ్చు నా వాల్యూస్ నా క్లాస్ కంటే ఎక్కువ .నేను మీ దగ్గర జాబ్ చేస్తున్నాను శాలరీ తీసుకుంటున్నాను అంటే దానికి అర్థం మీరు నన్ను కొనుకున్నారని కాదు ఇంకో మాట మీకు గుర్తు చేస్తున్నాను నేను కేవలం క్రూయిజ్ పార్టీ ఆర్గనైజ్ చేయడానికి మాత్రమే వచ్చాను .మీరు నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు అంటుంది నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎవరైనా వేలెత్తి చూపిస్తే నేను అసలు భరించాను అది నా బాస్ అయిన కూడా .నేను బ్యాక్ యార్డ్ కి వెళ్ళాను దొంగతనం చేయడానికి ఎవరు బ్యాక్ యార్డ్ కి వెళ్ళరు నాకు తెలిసి అంటుంది .


వంశ్ తెలుసు మరి ఎందుకు వెళ్ళావో చెప్పు అంటాడు .రిథిమా మనసులో భయపడితే వంశ్ కి దొరికిపోయాను నార్మల్ గా ఆన్సర్ చెప్పాలి అని అనుకుంటుంది .mr .VR నేను ఒక చిన్న హాస్టల్ రూంలో ఉండేదాన్ని ఇంత పెద్ద మాన్షన్ చూసి క్యూరియాసిటీ కలిగింది మాన్షన్ మొత్తం చూడాలని నిద్ర కూడా రాలేదు అందుకే బ్యాక్ యార్డ్ డోర్ ఓపెన్ అయివుంటే చూద్దామని వెళ్ళాను అంటుంది .వంశ్ అయితే ఎందుకు పారిపోయావు నన్ను చూసి అంటాడు .రిథిమా మీ గొంతు విని భయమేసింది మీరు ఎక్కడ షూట్ చేస్తారో మీ గన్ తో అందుకే పారిపోయాను అంటుంది .వంశ్ ఇంటరెస్టింగ్ వెరీ ఇంటరెస్టింగ్ అని వెళ్ళిపోతాడు .ఆర్యన్ రిథిమా నువ్వు కొట్టిన చెంప దెబ్బకి బదులు తీర్చుకుంటాను తప్పకుండా అంటాడు .ఆర్యన్ అమ్మ నా కొడుకుని ఆ అమ్మాయి కొట్టిన ఎవరు మాట్లాడలేదు అసలు ఎవరు తను కొట్టడానికి అని వంశ్ బాబాయ్ రాఘవ్ ని అడుగుతుంది మీరు కూడా ఏం మాట్లాడలేకపోయారు .ఆర్యన్ నాన్న ఎక్కడ మాట్లాడతాడు వంశ్ ముందు మీ వాళ్ళ వంశ్ దృష్టిలో నేను దేనికి పనికి రాను .మీరు వంశ్ నాన్న చనిపోయాక కొంచెం ధైర్యం చేసి బిజినెస్ మొత్తం మీరే హేండిల్ చేసి వుంటే ఈ ఇంట్లో మనదే అధికారం అయ్యేది servants కన్నా తక్కువ అయిపోయాము మీవల్ల అంటాడు .అందుకు రాఘవ్ కోపంతో ఆర్యన్ కాలర్ పట్టుకొని వంశ్ తో విశ్వాసంగా ఉంటుంది తన బిజినెస్ సీక్రెట్స్ అన్ని తెలుసుకోడానికే నువ్వు తొందరపడి పిచ్చి పనులు చేయకు .టైం వచ్చినప్పుడు వంశ్ ని మన నుండి ఎవరు కాపాడలేరు అని చెబుతాడు .

వంశ్ నానమ్మ పూజ గదిలో ఒంటరిగా పూజ కోసం కావలిసినవి లిస్ట్ రాసుకుంటూ ఇంత పెద్ద ఇంట్లో పూజ కోసం సహాయం చేసేవాళ్ళే లేరు నాకు అనుకుంటూ వుండగా రిథిమా వస్తుంది .ఏం చేస్తున్నారు నానమ్మ అంటుంది పూజ కోసం ఏం కావాలో లిస్ట్ రాస్తున్నా నేను హెల్ప్ చేయనా అని అంటుంది .సరే అని వంశ్ నానమ్మ ఒప్పుకుంటుంది .రిథిమా మీ అమ్మ పూజలు బాగా చేస్తారా అని అడుగుతుంది లేదు నానమ్మ నేను అనాధ ని హాస్టల్ లో గణపతి పూజ రోజు చేస్తాము మాకు అమ్మ నాన్న గణపతి యే అని అందరం అనుకుంటాము .వంశ్ నానమ్మ దీపం వెలిగించబోతే రిథిమా తను వెలిగిస్తానని తీసుకొని వెలిగిస్తూ పూజ ఎవరి కోసం పెట్టారు నానమ్మ అంటుంది వంశ్ దీర్ఘాయుష్షు కోసం పూజ చేస్తున్నా అంటుంది .రిథిమా మనసులో ఎవరిని అయితే జైలు లో పెట్టించాలని వచ్చానో అతని కోసం చేసే పూజలో హెల్ప్ చేస్తున్నా కానీ వంశ్ ఇలాంటివి ఏవి నిన్ను కాపాడలేవు అని వెళ్ళిపోతుంది .వంశ్ సియాకి టాబ్లెట్స్ ఇస్తూ ఏదైనా తిన్నావా లేదా అని అడుగుతాడు వంశ్ అన్నయ్య నా గురించి ఎంత కేర్ తీసుకుంటావు అని అంటుంది .రిథిమా అదంతా చూసి వంశ్ తన ఫ్యామిలీ తో చాలా డిఫరెంట్ గా ఉంటాడు నేను అనుకున్నట్టు అంత ఎమోషన్ లెస్ కాదు వంశ్ అని అనుకుంటుంది మనసులో .వంశ్ వెనక్కి తిరిగి రిథిమాని చూస్తాడు కానీ తను face పక్కకి తిప్పుకుంటుంది .రిథిమా సియాతో స్ట్రెచెస్ చేపిస్తూ ఉంటుంది .వంశ్ తన బాడీ గార్డ్ రాజ్ తో స్టడీ రూంలో ఏదో ఫైల్స్ వెతుకుతూ ఉండటం చూస్తుంది .వంశ్ ,రాజ్ ఫైల్స్ తీసుకొని వెళ్ళిపోతారు బయటికి .రిథిమా స్టడీ రూంలో evidences దొరుకుతాయేమో వెతకాలి అని సియా తో ఇప్పుడే వస్తాను అని స్టడీ రూంలోకి వెళ్తుంది .రిథిమా ట్రాన్స్మిటర్ కనెక్ట్ చేసి కబీర్ నేను వంశ్ స్టడీ రూంలో ఉన్నాను ఎలాంటి ప్రూఫ్స్ వెతకాలి అని అడుగుతుంది .కబీర్ రిథిమా ఏదైనా ఫైల్స్ ,laptop ఉన్నాయేమో చూడు తన అండర్ వరల్డ్ బిజినెస్ కి సంబందించినవి చూడమంటాడు .రిథిమా అలాగే అని ట్రాన్స్మిటర్ కిటికీ దగ్గర పెట్టేసి వెతకడం స్టార్ట్ చేస్తుంది .వంశ్,రాజ్ కారులో గేట్ దాటుతూ వుండగా వంశ్ లాప్టాప్ మర్చిపోయానని వెనక్కి వెళ్తాడు .రిథిమా వెతకడం వంశ్ చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు రిథిమా టెన్షన్ పడుతుంది వంశ్ ని చూసి .


Rate this content
Log in

More english story from Shaik Sameera

Similar english story from Thriller