తెలివైన కోడలు
తెలివైన కోడలు
రామనాథపురంలో నివసించే సూరమ్మ మహా గయ్యాళి . ఆమె కోడలు లలిత సాత్వికురాలు. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం. అందుకే మాటిమాటికీ వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటున్నదేమో అని గమనిస్తుండేది.
ఒకరోజు లలిత పక్కింటి ఆవిడతో మాట్లాడుతుండగా ఆవిడ " పుల్లని దోషాలు చేసుకుని ఎర్ర కారంతో నంజుకుని తింటుంటే భలే ఉంటుంది తెలుసా?" అని లలితతో అన్నది. అప్పటి నుంచే లలితకు తను కూడా పుల్లని దోసెలు ఎర్రకారంతో తినాలని కోరిక కలిగింది. దాంతో లలిత ఒక రోజు ఎర్ర కారం తయారు చేసుకుని, దోసెలు కోసం పిండి రుబ్బి పెట్టుకున్నది.
తీరా దోసె వేసుకోబోయేటప్పటికి పెనం మీద "సుయ్" మని శబ్దం వచ్చింది. శబ్దం విని సూరమ్మ గబా గబా వంటింట్లోకి వచ్చి "ఆమ్మో! ఆమ్మో! నాకు తెలియకుండా దోసెలు వేసుకుని తింటున్నావటే!" అంటూ తిట్ట సాగింది. గబగబా ఆ దోసెలు అన్నీ తానే వేసుకుని తినేసింది సూరమ్మ.
లలితకు ఏడుపు వచ్చింది. అయినా సరే! పుల్లని దోసెలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది. నాలుగు రోజుల తరువాత మళ్లీ సూరమ్మ సరే సరే! అంటూ వెళ్ళిపోయింది. మూడోసారి కూడా అలాగే చేయడంతో -
"దీనికి పెనం కాలింది లేనిది నీళ్లు చల్లితే తప్ప తెలియడం లేదు. అదే తనయితే చూపులతోనే కనిపెట్టేస్తుంది అనుకుంది సూరమ్మ. మళ్ళీ "సుయ్" మని శబ్దం వచ్చినా సూరమ్మ రాలేదు. దానితో లలిత హాయిగా దోసెలు వేసుకుని తినేసింది. ఇక ఆ తరువాత నుంచీ ఎప్పుడు దోసెలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత.
నీతి: మనల్ని బాధ పెట్టె వాళ్ల నుంచి చిన్న చిన్న ఉపాయలతో తప్పించుకోవచ్చు.
