STORYMIRROR

Harika Addala

Children Stories Inspirational Children

3  

Harika Addala

Children Stories Inspirational Children

దేవత - బంగారు గొడ్డలి

దేవత - బంగారు గొడ్డలి

1 min
0

అనగనగా ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఒక రోజు ఆ ఊరికి సమీపంలో ఉన్న నది ఒడ్డున కట్టెలు కొడుతున్న రామయ్య గొడ్డలి పట్టు తప్పి నదిలో పడిపోయింది. దీంతో దిగాలుగా తన జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయిందని భాదపడుతూ నది ఒడ్డున కూర్చుని విచారిస్తున్నాడు.

దీంతో రామయ్య భాదపడటం చూసిన నదీ దేవత రామయ్య ఎదుట ప్రత్యక్షమయ్యి ఏంటి రామయ్య అలా దిగాలుగా ఉన్నావు అని ప్రశ్నించింది. తల్లీ నేనూ రోజూ కట్టెలు కొట్టి వాటిని అమ్మితే గానీ పూట గడవదు.

ఇప్పుడు నాకన్నం పెట్టె గొడ్డలి నీ నదిలో పడిపోయిందని దిగాలుగా సమాధానం చెప్పాడు. దీంతో నదీ దేవత నదిలో నుండి ఒక బంగారు గొడ్డలి తీసి ఇదేనా రామయ్య నీ గొడ్డలి అని ప్రశ్నించింది. ఆ గొడ్డలి చూసిన రామయ్య నాది కాదని సమాధానం చెప్పాడు. 

మళ్ళీ నదీ దేవత వెండి గొడ్డలిని తీసి చూపగా అదీ నాది కాదని సమాధానం చెప్పగా మూడోసారి రామయ్య పోగొట్టుకున్న ఇనుప గొడ్డలిని తీసి చూపించింది. తన గొడ్డలిని చూసి సంతోషించిన రామయ్య ఇదే నా గొడ్డలి తల్లీ అని నదీ దేవతతో చెప్పాడు. 

బంగారు, వెండి గొడ్డల్లు ఇచ్చినా ఆశపడని రామయ్యను నదీ దేవత మెచ్చి రామయ్యకు ఆ మూడు గొడ్డల్లను ఇచ్చి మాయమయ్యింది.


Rate this content
Log in