STORYMIRROR

Harika Addala

Children Stories Inspirational Children

4  

Harika Addala

Children Stories Inspirational Children

తెనాలి రామకృష్ణ చెప్పిన గొప్ప జీవన పాఠం

తెనాలి రామకృష్ణ చెప్పిన గొప్ప జీవన పాఠం

1 min
10

ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు కుక్కకి సౌకర్యంగా లేదేమో మొరుగుతూ తెగ అల్లరి చేస్తోంది. విసుక్కున్నారు రాయల వారు కుక్కని అదుపులో పెట్టడం ఎవరివల్లా కాలేదు. తెనాలి రామకృష్ణుడు వచ్చి "మహారాజా తమరు అనుమతిస్తే కుక్కని నేను అదుపు చేస్తాను" అన్నాడు సరేనన్నారు రాయలవారు. 

వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కని తీసుకుపోయి నదిలో పారేసారు.

కుక్క ప్రాణ భయంతో ఈత కొడుతుంది. కాసేపయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి రామకృష్ణ. అంతే కుక్క ఒక మూలకి పోయి మొరగకుండా అల్లరి చేయకుండా ముడుచుకుని పడుకుంది .

ఆశ్చర్యపోయిన రాయల వారు "ఏం మాయ చేసావు రామకృష్ణ" అని అడిగారు.

రామకృష్ణ నవ్వేసి "మహారాజా లోకంలో అందరూ తానున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఎదో కావాలని ఆశ పడతారు నీటిలో పడేశాక అంతకు ముందు తనెంత సురక్షిత ప్రదేశంలో వున్నదో అర్థమయి కుక్కకి జ్ఞానోదయం అయింది." అన్నాడు.

"అలాగే మన పిల్లలకు ఎన్ని సౌకర్యాలు కలిపించినా వాటి విలువ అర్థం కావడం లేదు కావున కష్టం విలువను సమాజంలో ఏ మాత్రం సౌకర్యాలు లేకుండా జీవించే వారిని గురించి తెలియజేయాలి.

 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్