STORYMIRROR

Harika Addala

Children Stories Inspirational Children

3  

Harika Addala

Children Stories Inspirational Children

సమయం విలువ

సమయం విలువ

1 min
0

సమయం ఎంతో విలువైనది. ఏ సమయంలో చేయవలసిన పనిని  అదే సమయంలో చేయాలి. లేకుంటే అదృష్టం చేజారవచ్చు.

అనిత ఏడో తరగతి చదువుతుంది. తెలివైన అమ్మాయి. చక్కగా చదువుతుంది, చక్కగా పాడుతుంది కూడా. కానీ, ఆమెకు కొంచెం నిర్లక్ష్యం, బద్ధకం ఎక్కువ. ప్రతి పని వాయిదా వేస్తుంటుంది. "అలా చేయవద్దు" అని వాళ్ళమ్మ ఎన్నోసార్లు అనితను హెచ్చరించింది. కానీ అనిత నిర్లక్ష్యంతో ఆ మాటలు పట్టించుకునేది కాదు.

ఒకసారి ఆ ఊళ్ళో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అన్ని స్కూళ్ల విద్యార్థులకు పాటలు, ఆటల పోటీలో పాల్గొంది. అందులో ఆమెకు మొదటి బహుమతి వచ్చింది. 

కొన్నిరోజుల తరువాత ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ నుండి అనితకు ఒక ఉత్తరం వచ్చింది. గత నెలలో జరిగిన పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చినందుకు మరునాడు తమ కార్యాలయానికి వచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా రాశారు ఆ ఉత్తరంలో. అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తరువాత ఎప్పుడైనా వెళ్లి బహుమతి తెచ్చుకోవచ్చులే అనుకుని, మర్నాడు వెళ్లకుండా నాలుగు రోజుల తరువాత వెళ్లింది. ఆ సంస్థవారు బహుమతితో పాటు పట్టణంలో జరుగుతున్న పెద్ద సర్కస్ చూడ్డానికి రెండు టికెట్లు కూడా ఇచ్చారు. 

అయితే ఆ టికెట్టు అంతకు ముందు రోజు జరిగిన అటవి. అనిత అవి చూసుకుని 'అయ్యో! కనీసం నిన్న వచ్చినా బావుండేది కదా!' అని బాధపడింది. ఈ సంఘటనతో అనితలో ఎంతో మార్పు వచ్చింది. నిర్లక్ష్యంగా ఉండకుండా, ఎప్పటిపని అప్పుడే పూర్తి చేయడం ప్రారంభించింది.


నీతి: ఆలస్యం అమృతం విషం


Rate this content
Log in