STORYMIRROR

Harika Addala

Children Stories Inspirational Children

4  

Harika Addala

Children Stories Inspirational Children

గాలిమేడల రహస్యం

గాలిమేడల రహస్యం

2 mins
2

ఒకరోజున అక్బర్, బీర్బల్ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళ మాటలలో గాలిమేడల ప్రసక్తి వచ్చింది. "బీర్బల్! గాలిమేడలు అంటుంటారు. అవి ఎలా ఉంటాయి. వాటిని కట్టడానికి ఎంత ఖర్చవుతుంది" అని ప్రశ్నించేడు అక్బర్ బాదుషా! "జహాపనా! గాలిమేడలు కట్టడం అందరికి సాధ్యపడే పనికాదు. కొందరికీ గాలిమేడలు కట్టడంలో ప్రావీణ్యత ఉంటుంది. సర్వసాధారణంగా గాలిమేడలు కట్టేవారిని గురించడం కూడా కష్టం" అన్నాడు బీర్బల్.

ఆ మాటలకు అక్బర్ బాదుషా తనకు గాలిమేడలు చూడాలని వున్నదని పనివారిని రప్పించి కట్టించవలిసినదని, ఖర్చుకు వెనకాడవద్దని ఆదేశించేడు. సరే బాదుషా వారి ఆజ్ఞ మేరకు గాలిమేడలు కట్టించుతాను.వాటికి పునాదులు గోడలు ఉండవు. ఎన్ని అంతస్థులైనా కట్టవచ్చు. ఎన్ని అంతస్తులు కట్టించమని అన్ని అంతస్తులు కట్టగలవారిని రప్పించి మేడలు ఆరుమాసాల్లో కట్టిస్తానన్నాడు. 

ఆ తర్వాత బీర్బల్ బాదుషావారి దర్శనానికి రావడం మానివేశాడు. బీర్బల్ రాకపోవడంతో అక్బరుకు కాలక్షేపం జరగక కబురు చేసారు. పని వాళ్ళకోసం తిరుగుతున్నాను. వారు దొరకగానే మీ దర్శనానికి గాలిమేడలకు పాటు వస్తానని సమాధానం పంపించేడు. అనుకున్న ప్రకారం ఆర్నెల్ల కాలం గడిచిపోగా బీర్బల్ ఒకనాడు పాదుషా వారి సన్నిధికి. ఒకవ్యక్తిని తీసుకుని వచ్చేడు.

"ఏమయ్య బీర్బల్! గాలిమేడలు నిర్మాణం ఎంతవరకు వచ్చింది." అని ప్రశ్నించాడు అక్బర్ బాదుషా! ప్రభువులవారు సావదానంగా ఉంటే గాలిమేడల దర్శనం జరుగుతుంది. ఇతడే గాలిమేడలు నిర్మాణంలో ఎంతో ప్రవీణుడు. నా వద్దకు వచ్చిన ఇతడు మీ దర్శనమును కోరి యన్నందున మీ తావునకు తీసుకువచ్చాను. కొద్ది క్షణాలు మీరతనితో మాట్లాడినచో వీనికి గల ప్రావీణ్యత అవగతమౌతుంది". అన్నాడు బీర్బల్.

"నువ్వు చాలా ప్రవీణుడువని బీర్బల్ చెబుతున్నాడు. నీది యే ఊరు? నీ తల్లితండ్రులెవరు? నువ్వేం చేస్తుంటావు?" అని అక్బర్ ఆ వ్యక్తిని ప్రశ్నించాడు. "జహాపనా! ఏమని చెప్పను. చాలా చరిత్రగలిగిన సమర్థుడను. నా తల్లిదండ్రులు వాళ్ళు కాబట్టి నన్ను పెంచగలిగేరు. మా స్వగ్రామమైన బర్కల్ నగరుకు తరుచుగా పహిల్వానులు వచ్చేవారు. వారితో పసితనంలోనే కుస్తీలు పట్టేవాడ్ని. నా పేరు చెబితే మల్లయోధులు మా ఊరు వచ్చేవారుగాదు.

ఇరుగుపొరుగు రాజులు నాకీర్తివిని నన్ను తమవద్దకు పిలిపించుకొని, కానుకలు నేను మోయలేనంతగా ఇచ్చేవారు. ఆ కానుకలతో నేనే నా తల్లితండ్రులను పెంచేవాడిని. ఒక్క మల్లవిద్యతోనే గాక ఇంకా అనేక విద్యలలో పేరుకీర్తులందుకున్నాను. తమవంటి ప్రభువులను ఆశ్రయించి ఒక చిన్న జాగీరును సంపాదించి, ఆ జాగీరకు నా తండ్రిని సుల్తానుని చేసి, వారి అంగరక్షకుడుగా నుండి మరొకటి మరొకటిగా జాగీర్లు సంపాదించుకుని, తమవంటి వారి స్నేహసౌశీల్యాదులతో వర్ధిల్లగల సమర్థత కలిగినవాడను. అంటూ ఇంకాయేమేమొ చెబుతున్న అతనిని బీర్బల్ ఆపుచేసాడు. 


Rate this content
Log in