Dinakar Reddy

Children Stories Inspirational Children

4  

Dinakar Reddy

Children Stories Inspirational Children

స్నేహం - మరువం

స్నేహం - మరువం

2 mins
291


అదేంటి శేఖర్! ఇప్పుడేమైందని అంత బాధ పడుతున్నారు. పిల్లలు చూస్తే ఏమనుకుంటారు? శేఖర్ కన్నీళ్లు చూసి అతని భార్య సునీత ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉంది.


సునీతా! మాధవ్ నాకు మంచి స్నేహితుడు. అతను అడిగినప్పుడు నేను డబ్బు సర్దుబాటు చేయలేకపోయిన మాట నిజమే. ఎవరో నేను డబ్బులు ఉంచుకొని కూడా సాయం చేయట్లేదని చెబితే నమ్మి నాతో మాట్లాడ్డం మానేశాడు అంటూ ఆపాడు శేఖర్.


అదంతా జరిగిపోయిన సంగతే కదండీ. ఇప్పుడు ఎందుకు బాధ పడుతున్నారు అని లాలింపుగా అడిగింది సునీత.


మాధవ్ కొత్త ఇల్లు కట్టుకున్నాడు. మన పక్క వీధిలోనే. గృహ ప్రవేశానికి పిలుస్తాడనుకున్నాను. పిలవలేదు. చూడు. మా బ్యాచ్ లో అందరినీ పిలిచి నన్ను పిలవకుండా దూరం పెట్టాడు అని తన మనసులోని బాధను పంచుకున్నాడు శేఖర్.


సునీత అతని భుజం పైన చెయ్యి ఉంచి మీ స్నేహితుడు సొంత ఇల్లు కట్టుకున్నాడు అని సంతోషించదగ్గ విషయం కదా. మిమ్మల్ని పిలవలేదు. నిజమైన స్నేహం సొంత అస్థిత్వాన్ని కూడా వదిలి స్నేహితుల మీద అభిమానం కలిగి ఉంటుంది. మీ బాధ పక్కన పెట్టి అతని ఎదుగుదలకు సంతోషించడం స్నేహితునిగా మీ హక్కు. అతను మీతో మాట్లాడకపోవచ్చు. మనస్పర్థలు ఎల్లకాలం ఉండవు కదా శేఖర్. అతడికి మంచే జరగాలని కోరుకుని మీరు ఈ బాధ నుండి బయట పడండి.


స్నేహం మరువం లాంటిదని మా బామ్మ చెబుతుండేది. ఎండిపోయినా వాసన ఇచ్చే మరువంలా స్నేహితులు దూరమైనా వారికి మంచి జరగాలనే ఆలోచనలే మనసు కోరుకుంటుంది నిజమైన స్నేహం. కాస్త స్థిమితపడండి అని సునీత అతడికి మంచి నీళ్ళు అందించి ఇంటి పనుల్లో మునిగిపోయింది.


మరుసటి రోజు సాయంత్రం శేఖర్ కొడుకు గోపి ముభావంగా కూర్చుని హోమ్ వర్క్ చేసుకుంటున్నాడు. సునీత నిన్న ఓదార్చిన తీరుతో శేఖర్ మనసు ప్రశాంతంగా ఉంది. శేఖర్ పిల్లవాడి పక్కన కూర్చుని ఏం జరిగింది నాన్నా అని గోపీని దగ్గరికి తీసుకున్నాడు. శేఖర్ కూతురు చిన్ని బయట ఆడుకుంటోంది.


డాడీ! మరేమో మా ఫ్రెండ్ సోమూ లేడూ. వాడి కొత్త బ్యాగ్ నేను చెప్పకుండా తీసుకున్నా అని నాతో మాట్లాడ్డం లేదు అంటూ తన చిన్ని చేతుల్ని చెంపల కింద వుంచి చెప్పాడు.


స్నాక్స్ తీసుకుని వంట గదిలోంచి బయటికి వస్తూ శేఖర్ పిల్లాడికి ఏం చెబుతాడా అని చూస్తూ ఆగింది సునీత.


Rate this content
Log in