jagjit singh

Others

4  

jagjit singh

Others

ఒంటరి

ఒంటరి

1 min
322


ఆయన పెద్ద, ఆమె చిన్న :- 

తనకి కూతురుంటె, అనే భావనాయనది, 

తనకి తండ్రుంటె అనే భావనామెది. 

ఆమె తన డాన్స్ తో స్టేజ్ మీద మెరుపులు మెరిపిస్తుంది, ఆయన చూసి ఆనందించే వాడు. 

ఆయన గొప్ప రచయిత, సైకాలజీలో, అంతర్జాతీయంగా. 

డబ్బు, ఖ్యాతి వారి సొంతం, లేనిదల్లా సొంతం అనుకునే సిసలైన ప్రేమ. 

ఆయన తెగ నవ్వేవాడు, సైకాలజి తెలసిన వాడు కద. 

ఆమె మూడి కాని ఆయన వద్ద నవ్వు నేర్చుకుంది. 

లోకం ఆమె మెరుపులు చూసి ఆశ పడేది, , ఆమె ఈయన నవ్వుని ఆశించింది. 

కాలం గడిచింది. 

ఆమె నవ్వడం నేర్చుకుంది, ఆయన బదులు. 

కాలం కరోనాలా వచ్చి కాటేసింది, ఆయన వెళ్లి రెండు సంవత్సరాలు. 

ఆయన కోట్ల సంపాదన ఆమెకి వచ్చింది, ఆమె తనకి వద్దని ఆయన ట్రస్టుకి ఇచ్చేసింది. 

ఆమింకా డాన్స్ చేస్తూనే ఉంది, ఆయనకి ఇష్టం కద. తనకి తండ్రి అండనిచ్చి తన, ఆయన అనాథ తనం మరిపించిన వారు కద. 

ఆయన మెరిసే జుట్టులో తనదనం చూసుకుంటుంది. 

నాన్నకి ప్రేమతో.


Rate this content
Log in