jagjit singh

Others

4  

jagjit singh

Others

మనిషి కథ

మనిషి కథ

1 min
260


ఆయన చిన్నప్పటి నుండి అంతె. చిన్న నవ్వు, తలవంచుకుని వెళ్లిపోవడం. 

ఏం చేసేవారు:-


 చేశారు లెండి ఏ ఉద్యోగమొ, వ్యాపారమొ. 

పెళ్లైందా! :-అయిందిగా, ఒకమ్మాయి, అబ్బాయిను. 

మరి భార్యో :- ఆయమ్మ ఇంటిపట్టునే,ఆయనకి నీడై. 


ఉదయాన్నే లేవడం, స్నానం చేయడం, పూజ చేయడం, తను ఏం పెట్టిన చిరునవ్వుతో తినడం, తయారై తన పనులు చూసుకోవడం. 

పిల్లలు చక్కగా చదువుకున్నారు, పెళ్ళిళ్ళై సెటిల్ అయ్యారు. 


అమ్మని నాన్నని తమ వద్దకు రమ్మన్నా వారు రారు. 

ఆయన్ని చూసుకోవడంలో ఆమెకి జీవితం గడిచింది, ఆమెతో ఆయన జీవితం గడిచింది. 


ఇప్పుడు ఆయనకి పనిలేదు, చేసే వయసు కాదు. 

అయినా తెల్లవారే స్నానం, పూజాని. తొందరెందుకొ:- మళ్ళీ అదే చిరునవ్వు. అమ్మకి ఆ నవ్వుని నేర్పాడు. 

జీవితం ఇలాగే సాగిందా, ఇలాగే సాగింది. 

తుఫానులురాలేదా, వచ్చాయి, చిరునవ్వుతో గడిపారు, ఆకలిలో. 


ఆయనకి పూజ తరువాత రాత్రి మజ్జిగన్నం తినడం అలవాటు, చలవంటారు. 

ఆమెకి అలవాటైంది. ఏదొకటిలే ఆయనతోనే జీవితం అనుకుంటు. 

మజ్జిగన్నం తిన్న తరువాత ఓ కునుకు తీయడం అలవాటు. 


ఆమెకి అలా ప్రక్కనే వాలడం అలవాటు. 

ఏమొ ఏమైన ఆయనకి కావాలేమొ. 

ఎక్కువ మాట్లాడరాయె. 

ఓ రోజు అలేగే కునుకు పడ్డారు. 

ఆమెకి మెలుకువ వచ్చింది, ఆయనకి రాలేదు. 

ప్రతి రోజు మజ్జిగన్నం తరువాత వక్క బుగ్గన పెట్టడం అలవాటు, ఆమెకి ఒక పలుకిచ్చి. 

నోట్లో పలుకు అలాగె ఉంది, పలుకు లేదు. 


ఆదరాబాదరాగా ఆమె తన జుట్టు కొప్పు పెట్టుకుంటు, పైట సరిజేసుకుంటు, కంటి తడి తుడుచుకుంటు ఓసారి ఆపాదమస్తకం తడివి చూసుకుంది, నీరసించి గోడకు జేరబడింది. 

ఆలా వారు సంసార సాగరాన్ని దాటారండి. నమస్కారం. 


Rate this content
Log in