VENKATA BHANU PRASAD CHALASANI

Others

4  

VENKATA BHANU PRASAD CHALASANI

Others

భూగర్భ నిధులు

భూగర్భ నిధులు

1 min
546


పూర్వం రాజులు తమ సంపదను ఖజానాలో ఉంచి దానికి రక్షణగా సైనికులను కాపలాగా ఉంచేవారు. మరి ధనవంతులైతే బందిపోట్లు

దోచుకుంటారనే భయంతో నేలను తవ్వి తమ

నగలను దాచుకునేవారు. ఈ విధంగా దాచిన

సొమ్ము తమ వారసులకు అందే విధంగా వారు

ఏర్పాటుచేసుకునేవారు. కొన్ని సార్లు ప్రకృతి

వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ యుద్ధాలు

వచ్చినప్పుడు వారసులకు వివరాలు అందించే

అవకాశం లేక ఆ నిధి నిక్షేపాలు భూమిలో అలా

ఉండిపోతాయి. అలాంటి నిధి నిక్షేపాల మీద

ఆశతో చాలా మంది పురాతన కోటలు ఉన్న

ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తుంటారు. అసలు

అలా లభించిన సంపద ప్రభుత్వానికి ఇవ్వాలని

చట్టం ఉంది. అయినా ఆ సంగతి గురించి వారు పట్టించుకోకుండా తవ్వకాలు జరుపుతూ ఉంటే

వారికి సహకరించే కొందరు స్వాములు మంత్రాలు

అవీ చెప్పి, పూజలు చేసి నిధులను వెలికి తీస్తాం

అని ఆశ చూపి దోచుకుంటున్నారు. కష్టపడి

సంపాదించిన సొమ్ము మనతో నిలుస్తుంది.

ఆ విషయం తెలిసి కూడా నిధి నిక్షేపాలు లభిస్తాయి,అయాచితంగా ధనం లభిస్తుంది

అనే కోరికతో చెయ్యరాని పనులు చేస్తుంటారు.

పని చేసుకుని సంపాదించిన సొమ్ము మనిషికి

తృప్తిని ఇస్తుంది.



Rate this content
Log in