STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Others

4  

SATYA PAVAN GANDHAM

Others

వ్యవ"సాయం"

వ్యవ"సాయం"

1 min
344

ఎవరూ..? ఎవరూ...??

సేద్యాన్ని జూదంగా మలిచెందెవరు..??

పుడమి తల్లి కడుపు కోతకి కారణమెవరు..?? 

నమ్ముకున్న నేలని అమ్మకానికి తాకట్టు పెట్టదలిచిందెవరు..??

నింగి విడాల్సిన నీటి చుక్క రైతు కంట జారడానికి కారకులెవరు..??


ఎవరూ..? ఎవరూ...??

కడుపు నింపెటోడి కుటుంబాల కడుపు కొట్టిందెవరు..??

రైతే "రాజన్న" నానుడి నుండి రైతుని బానిస చేసిందెవరు..??

వ్యవసాయంలో సాయానికి బదులు వ్యయాన్ని ప్రేరేపించిదెవరు..??

పంట భూమికి సొంతమైన రైతు కష్టాన్ని నడి రోడ్డు పైకి ఈడ్చిందెవరు..??


ఎవరూ..? ఎవరూ..??

నువ్వా...! లేక నేనా...!!

మనమా..! లేక జనమా...!! 

సిగ్గులేని సమాజమా..! లేక పనికిమాలిన ప్రభుత్వాలా...!!



Rate this content
Log in