సొల్లు ఫోన్
సొల్లు ఫోన్


సెల్ ఫోన్ కాధురన్నో ఇది సొల్లు ఫోన్...
పనికి వచ్చే మాట కన్నా పనికి రాని మాటలే మధురమన్నో...
సొల్లు వద్దులే అని నువ్వనుకున్నా కుదరదు అన్నో...
ఫోన్ ఎందుకు లేపలేదు అని లేపినంక సంపుతారన్నో...
సెల్లుఫోను లో సొల్లు కబుర్లు చెప్తూ కాలం వెళ్లదీస్తారాన్న...
పొట్ట కోస్తే అక్షరం ముక్క రాధన్న...
భవిష్యత్తులో ఆ భవిత కి జీవితం అంతా అయోమయమన్నా...
సెల్లు ఫోనులో సొల్లు కోసం కొత్త రకాల ఆప్ లన్న
ఒకడు వాట్స్ అప్ అంటాడు
ఒకడు స్కైప్ కాల్ అంటాడు...
ఒకడు జూం కాల్ అంటాడు...
ఆ సొల్లు కబుర్ల తో వచ్చేది చివరికి మనస్పరధలే అన్నా...
ఫ్రీ బ్యాలెన్స్ లు వచ్చి పెంచింది సొల్లు ముందు కన్నా...
అసలు అవసరమైన దానికంటే సొల్లు కే వాడతారు సెల్లునన్న...
ఇదే నేటి నిజం అన్నా...నువ్వు కాదనగలవా చెప్పన్నా..