STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Children Stories Action Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Children Stories Action Inspirational

శీర్షిక :దక్షిణ అయోధ్య కల్యాణ రామయ్యా. తేదీ:25 -3-2023 kaweeshwar

శీర్షిక :దక్షిణ అయోధ్య కల్యాణ రామయ్యా. తేదీ:25 -3-2023 kaweeshwar

1 min
281

శీర్షిక :దక్షిణ అయోధ్య కల్యాణ రామయ్యా...... 

తేదీ:25 -3-2023(శనివారం)

--------------------------------------

అంశం: బాలసాహిత్యం

ప్రక్రియ: బాలగేయం

శీర్షిక :దక్షిణ అయోధ్య కల్యాణ రామయ్యా......

***************

అసురుల అరాచకాలు నిర్ములింప రామునికి వీర తిలకం 

ఈ జగాన శాంతి సౌభాగ్యాల విస్తరణ కై చేసిన రాజ్య తిలకం 

అవతార పురుషుని కౌశల్యా దశరథుల ఇనకుల వంశ తిలకం 

ముద్దు బిడ్డడు నీలమేఘ శ్యామ ఆజానుబాహు సౌందర్య తిలకం 

చందన సత్కారం , రామా లాలి రఘు వంశ మణిమయ శ్రీ తిలకం 

విగ్రహవాన్ ధర్మునికి భూమాత జాత సమర్పించు పవిత్ర తిలకం

సకల మునీశ్వరుల ఇనవంశ సోమునకు జ్ఞాన విజ్ఞాన వాణీ తిలకం

 రఘువంశ భద్రాద్రి వా సునకు పరిమళ నవ వర్ష కల్యాణ తిలకం

నవ కల్యాణ మూర్తి జంటకి కి విఖ్యాత భవ్యపట్టాభిషేక దివ్య తిలకం

నవవర్ష , నవయుగ ఆది పురుషునకు ధరిత్రి భక్త పరిమళ తిలకం

దానవేంద్రుని నిర్జించిన రాఘవేంద్రునకు, సహవాసులవీర తిలకం

కరుణా, ఆర్త త్రాణ శరణాగతుల రక్షణ చేసేవిభునికి నవ సింధు తిలకం

అరుణవంశ ప్రఖ్యాతిలామానవ వంశ వృద్ధికి అభయప్రదాతకుకస్తూరి తిలకం

సీతా రాములకు సకల జనుల ఇలాదక్షిణ అయోధ్యభక్త జనాల కల్యాణ తిలకం 

వ్యాఖ్య : "శ్రీ రామ నవమి పర్వదిన అందరికి శుభా కాంక్షల తో ఈ వచనకవిత కు పరిమళ తిలకం".

--------------------------------------

రచన:కవీశ్వర్ జయంత్ కుమార్ 


Rate this content
Log in