Raja Sekhar CH V

Others

4  

Raja Sekhar CH V

Others

రెండువేల పంతొమ్మిది సంవత్సరం

రెండువేల పంతొమ్మిది సంవత్సరం

1 min
354


శాశ్వత సెలవు తీసుకుంటోంది రెండువేల పంతొమ్మిది సంవత్సరం,

ఈ ఏడాది వీడ్కోలుతో పూర్తి కాబోతోంది రెండువేలపదుల వర్ష దశాబ్దం |౧|


వచ్చింది ఈ ఏడు ఆంధ్రప్రదేశానికి నూతన రాజ్య ప్రభుత్వం,

భారత్ దేశానికి వచ్చింది నూతన పంచవర్ష కేంద్ర ప్రభుత్వం |౨|


ఛిద్రమైన భారతీయ అర్థవ్యవస్థ అయ్యింది చిన్నాభిన్నం,

పుంజుకోవటానికి సర్కారు చర్యలేమి అనిపించడంలేదు అభిన్నం |3|


రాజ్యాంగంలో వచ్చాయి నూతన పౌరసత్వ విధానాలు,

దేశమంతటా జరుగాయి తీవ్రమైన విభేదాలు విరోధాలు |౪|


దేశ పరిస్థితులు బావుంటే ప్రజలు ద్వారా ఉండవు ఆర్తనాదాలు ,

అందుకు ప్రభుత్వానికి తెలుసుకోవాలి ప్రజల విషయాలు మనోభావాలు |౫|


నూతన రెండువేల ఇరవై సంవత్సరానికి చెయ్యాలి స్వాగతం,

ఈ కొత్త దశాబ్దానికి చెయ్యాలి హృదయపూర్వక సుస్వాగతం |౬|


Rate this content
Log in