రాజన్న రాజ్యం
రాజన్న రాజ్యం
రాజన్న రాజ్యం సిరి సంపదల రాజ్యం
గోప్పోల్లకి కాదు పేద వాళ్ళకి వచ్చిన రాజ్యం...
రాజన్న రాజ్యం మువ్వెన్నల రాజ్యం...
ముద్దు పలుకులకు పద్యాలు నేర్పిన రాజ్యం...
రాజన్న రాజ్యం రైతే రాజయిన రాజ్యం…
మనకి అన్నం పెట్టే అన్న కి అన్నం పెట్టిన రాజ్యం...
రాజన్న రాజ్యం చిరునవ్వుల రాజ్యం…
ఉచిత వైద్యం ఇచ్చి పేదల పెదాలపై నవ్వులు పూయించిన రాజ్యం….
రాజన్న రాజ్యం రామ రాజ్యం…
విన్నాము రామ రాజ్యం గురించి...
చేసి చూపావు ఇదే అది అని దాని గురించి…
మార్చావూ మా తల రాతనీ
ఇచ్చావు నీ ఆపన్నా హస్తాన్ని...
చూపావు నీకు సాటి ఎవరు రాలేరు అని...