STORYMIRROR

EERAY KHANNA

Children Stories Inspirational Children

4  

EERAY KHANNA

Children Stories Inspirational Children

" నవ్వుల పువ్వులు"

" నవ్వుల పువ్వులు"

1 min
248

      " నవ్వుల పువ్వులు " - రాజేష్ ఖన్నా


        ============================


నవ్వుకే నడకలు నేర్పిన చిత్రాలు


అర్థంకానీ ఆనందానికి సూత్రాలు


అవే అవే పసిపాపల బోసినవ్వులు


జనకుల ఆశలకు ఆనవాళ్లు


ఒత్తిడిని కట్టడిచేసే సరిహద్దులు


రాబోయే తరానికి పునాదిరాళ్ళు


ఓ తరం మనుగడకి కారణాలు


తల్లిదండ్రుల జీవితానికి తోరణాలు


ఆ నవ్వులకోసమే అర్థమవ్వని పోరాటాలు


వాటికోసమే అంతుతేలని ఆరాటాలు


వారసులని విశ్రాంతిలేకుండా చేసిన విన్యాసాలు


తమ రక్తమేనని గొప్పలు చెప్పిన తిప్పలు


ఆకలితో అలమటిస్తూ అన్నమెరుగని పస్తూలు


ఆరోగ్యం బాగుండాలని నోచుకొన్న నోములు


కడుపు నింపాలని కష్టాన్ని ఎదురించిన కన్నీళ్లు


ఇవన్నీ తమ పిల్లల చల్లని నవ్వులకోసమే


ఆ నవ్వులకోసమే బ్రతికిన ప్రాణాలు


ఆ నవ్వుల పువ్వుల్ని చిదిమితే తట్టుకోగలవా


వావివరుసలు మరిచి మృగాళ్ల నోర్లు తెరిచి


పాశవికంగా ప్రవర్తిస్తే ఆ కథని దాపెట్టుకోగలవా


పాఠాలపేర్లతో బెత్తం దెబ్బలు రక్తమకరందం


చిందేలా కొడితే చూసి ఓర్చుకోగలవా


అన్నీ త్యాగాలు ఆ నవ్వులు పదిలంగా ఉండాలనే


ప్రయాసలన్నీ ఆ పసి ప్రాణాలకోసమే కదా


పిల్లలు కావాలని వాళ్ళ నవ్వులు కావాలని


వైద్యుల కాళ్ళు పట్టుకొని దేవుళ్ళ వేళ్ళు ముట్టుకొని


కాలేకడుపుల నోళ్లు కట్టుకొని కనిపెంచిన పిల్లలు


కేటుగాళ్ల మాయవలలో చిక్కి మాయమౌతున్నారు


చదువులభారంతో కనిపెట్టని బంధీలౌతున్నారు


కన్నవారికి పిల్లల కన్నీళ్లే కనిపిస్తాయి


వాళ్ళు గోలచేసి ఏడ్చే అరుపులే వినిపిస్తాయి


పిల్లల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని

వాళ్ళ బలహీనతల్ని రంగులుగా పూసుకొని

ఆకర్షించి ఎత్తుకుపోయి కన్నవారిని

కన్నవారి కన్నీళ్ల కథల్ని విన్నవారిని

ఏడిపించి ఏకంగా ప్రాణాలు తీసే మనిషి

అడ్డదారులకు పునాదులేస్తూ పురుడుపోస్తూ

సమాజానికి నిలకడలేని సవాలుచేస్తూ


విసిగిస్తూ విర్రవీగి సాధించేదేమిటి

నవ్వులపువ్వుల్ని నా పాదాల కింద నలపడమేగా


            ********* సమాప్తం*******



Rate this content
Log in