STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Others

5  

SATYA PAVAN GANDHAM

Others

"నిర్జీవి"

"నిర్జీవి"

1 min
392

అదృష్టానికి ఆరాటపడే ఆశ జీవిని నేను...

దురదృష్టానికి దగ్గరగా ఉండే దుర్బర జీవిని నేను


ఆనందమెరుగని అజ్ఞాతవాసంలో అంధజీవిని నేను

అర్ధం లేని కథకి భాషేరుగని మూగ జీవిని నేను


కోపానికి కాపలా ఉండే క్రోధ జీవిని నేను

సహనానికి సావాసమవని శత్రు జీవిని నేను


చెట్టులా ఎదగాలనుకునే విత్తు లాంటి కష్ట జీవిని నేను

విపత్తు లకు ఒరిగిన మోడు లాంటి నష్ట జీవిని నేను


బాధ్యతలకు బానిశనైన భార జీవిని నేను

బాధలకు దాసోహమైన దుఃఖ జీవిని నేను


వినీలాకాశంలో ఎగారాలనుకునే స్వేచ్ఛా జీవిని నేను

విశాల పుడమికి పరిమితమైన అసంతృప్త జీవిని నేను


సమయంతో సాగిపోతున్న శ్రమ జీవిని నేను

చివరకు చిరంజీవిలా మిగిలివున్న నిర్జీవిని నేను



Rate this content
Log in