మన తప్పుల కుప్పలు
మన తప్పుల కుప్పలు


-------------------------
నాగరికజీవనసౌకర్యసాధనాలు
కాలానుగుణ్యవైకల్యాల పాలై
విసర్జిస్తున్న వ్యర్థాలకుప్పల్తో
కప్పబడితొక్కబడి విషాలపాలై...
కుంచించుకు పోతోంది
మన భూలోకం!!
జీవరాశులందరికీ
హాయిగా బ్రతుకేందుకు
అనువైన
స్వచ్ఛమైన
పచ్చనైన భూలోకం
అందమైన మన లోకం
ప్లాస్టిక్కుల క్యాన్సరు కోఱలు
పాలిమర్ల రోగపు మోఱలు
కృత్రిమమౌ పదార్థాలు
కలిగించే అనర్థాలు
స్వయంకృతాపరాధాలై
మన మీదకు వస్తున్నాయ్!
మన భావితరాలకు
వ్యథలను ప్రోగేస్తున్నాయ్ !
ఇంకేం...
బయల్పడ్డాయ్ రహస్యాలు
అంతమౌతాయ్ సమస్యలు
మొదలెడదాం అదేపనిగ నష్టనివారణచర్యలు!!!
ప్రకృతిసిద్ధముగ లభించు
వస్తువులను వాడదాం
హరితపత్రశోభలతో
భూతలాన్ని నింపుదాం
పర్యావరణాన్ని రక్షిద్దాం
ఆరోగ్యంగా జీవిద్దాం!!!