మాతృభాషలు....తల్లిపాలు
మాతృభాషలు....తల్లిపాలు
ఆంగ్లం లేకపోతే ఆంధ్రులు బ్రతకలేరా
ఎప్పటినుండి వచ్చింది ఈ ఇంగ్లీష్
వేలాది వసంతాల విశాల తెలుగుకి
తెగులుగా పట్టి పిచ్చి ఎక్కిస్తుంది
నైపుణ్యాలు ముఖ్యమా మాధ్యమమా
బ్రతుకు తెరువుకి ఆంగ్లమే ముఖ్యమా
అమ్మను కాదని ఆ బొమ్మను పిలిచి
మన కంట్లో కారం మనమే కొట్టుకుంటే
బావి తరాలు మనల్ని క్షమించవు
సమాంతర మాధ్యమాలు ఉండగా
ఈ దుందుడుకు నిర్ణయం ఎందుకు
తలిదండ్రులు కోరేది గుణాత్మక విద్య
ఆంగ్లంలో నిష్ణాతుడు ఎందుకోసం
కాల్ సెంటర్ కౌంటర్ మేనేజ్మెంటుకా
సాంకేతిక విద్యా వ్యవస్థ కావాలి
వ్యవసాయ వ్యవస్థపై సమగ్ర విద్య
చేతి వృత్తులకు అధునాతన విద్య
పరిశోధనాత్మక వృత్తి విద్యలు రావాలి
ఇంగ్లీషులో మాటాడినవాడే వివేకైతే
అమెరికాలో ఏషియన్ ప్రాభల్యమెందుకు
తెలుగువారము విశ్వవినువీధుల్లో...
నిండుగా వెలుగుతున్నాం ఆంగ్లం వల్లా?
కేవలం అపార లోకజ్ఞానం,సాంకేతికం.
అవసరమే ఇంగ్లీష్ విశ్వవిపణి వ్యవస్థకు
పరాయి బాషా పరిజ్ఞానం పెంచాలి కానీ
ఎంచుకోడానికి వీలులేకుండా దాన్నీ...
మోసుకోవలసిన దుస్థితి రాకూడదు
సక్సెస్ బడులు ఉండనే ఉన్నాయి
నాన్ సక్సెస్ నీ సక్సెస్ చేసి ఇవ్వాలి.
ఏకంగా తెలుగు మాధ్యమాన్ని లేపేస్తే
అమ్మను ఇంట్లోంచి గెంటివేయడమే
అర్ధం పర్ధం లేని వితండవాదం కొందరిది
ఇంగ్లీష్ మీడియంలో సాంకేతికలేని విద్య!
ఇప్పటికే ఇంగ్లీష్ వింగ్లీష్ నడుస్తుంది..
కోడ్ మిక్సింగ్ కోడ్ స్వీచింగ్ మయమేకదా
ఆంగ్లలో అర్ధంకాక తెలుగు మీడియంలేక
ఎందుకొచ్చిన తంటాలు బాబూ పిల్లలకు
ప్రపంచ బాషా పరిజ్ఞానం అత్యవసరం
స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు రావాలి
తెలుగుని మాధ్యమం తొలగించి కాదు
తెలుగుని వెలిగించి ఆ వెలుగులోనే
ఆంగ్లమైనా మరేదైనా ప్రకాశవంతమై
విజ్ఞాన సముపార్జనకు దోహదమవ్వాలి
అమ్మను మరిచి మమ్మీని పిలిచి
తరతరాల తెలుగుకి సంకెళ్లు వేసేసి
మనం డమ్మీలం అయిపోతే హతవిధీ
ఆంగ్లేయులు కూడా ఆశ్చర్యపోయి
ఆంధ్రుల అవివేకాన్ని అసహ్యించుకోరా!