STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Others

4  

SATYA PAVAN GANDHAM

Others

"కనువిప్పు"

"కనువిప్పు"

1 min
365

నాయకుడెవడు ?? పాలకుడెవడు??

కులమతాల్ని చీల్చి నీ మద్దతుతో గెలిచేటోడా??

రాగవిధ్వేశాలు రగిల్చి నీ అడ్డుతో ఊరెగేటోడా??

నీ సొమ్ము దోచి విలాసాలు చేసేటోడా??

నీ కష్టాన్ని అమ్మి సొమ్ము చేసుకునేటోడా??


నాయకుడెవడు ?? పాలకుడెవడు??

అక్రమాలపై అశ్రమిస్తున్నోడా??

అరాచకాలపై విశ్రమిస్తున్నోడా??

గద్దెనెక్కి ప్రగల్భాలు పలికేటోడా??

తెరెనుక రహస్యపు లాలూచీలాడేటోడా??


నాయకుడెవడు ?? పాలకుడెవడు??

ఉచిత పథకాలతో ఉరేసేటోడా?? 

అమలుకాని హామీలతో ఆశగొల్పేటోడా??

మధ్యతరగతోడిని మభ్యపెట్టేటోడా??

సామాన్యుడితో చెలగాటమాడేటోడా??


ఎవడు నాయకుడు ?? ఎవడు పాలకుడు??



Rate this content
Log in