ఎస్ పి బి
ఎస్ పి బి
1 min
19
ఎస్ పి బి గా నీవు సుప్రసిద్ధం
తెన కన్న మధురం నీ గానం..
నీ స్వరము తోనే మొదలు
మాకు ఉషోదయ సుప్రభాతం...
నీవు పాడిన జోల పాట
అమ్మ ఒడిని తలపిస్తుంది ఓ క్షణం
కాదేమో నీ పాట కి ఎది అనర్హం
అనిపిస్తుంది నీ పాట విన్న అనుక్షణం.
స్వర్ణ యుగపు సంగీతా గానాల నుంచి
నేటి గానాల దాకా సాటి లేనిది నీ ప్రస్థానం.,
ప్రతి గాయకుడి కి నీవేగ ఆదర్శం..
నీ పాటలు వింటూ పరవశించడం మా అదృష్టం...
నేను చెప్పింది అక్షర సత్యం
నీ స్వరము ఒక వసంతం..
గాన సరస్వతీ నిత్యము నీ సొంతం..