చిన్ననాటి తియ్యటి స్మృతి
చిన్ననాటి తియ్యటి స్మృతి


అందరి జీవితాలలో ఉండెను సుమధుర జ్ఞాపకాలు,
ఆనాటికి ఈనాటికి ఏనాటికి అవి అయ్యెను మధుర భావాల అనుభవాలు |౧|
చిన్నతనం ఎల్లప్పుడూ ఒక చిరస్మరణీయ రమణీయ స్మ్రుతి,
ఎప్పడు గుర్తు తెచ్చుకున్న కలిగించెను అందమైన అనుభూతి |౨|
ఎన్నటికీ మరువనిది అమ్మ చెప్పే భక్తిరస నీతి పలుకులు కథలు,
మనఃశాంతి కలగించెను అమ్మ పాడిన భక్తి గీతాలు శ్లోకాలు మంత్రాలు |త్రీ|
ఒక అందమైన కలగా అనిపించెను అమ్మమ్మా తాతగారి ఇల్లు,
ఘుమఘుమలాడే వంటలతో పరిమళించెను మా అమ్మమ్మగారి వంటిల్లు |౪|
వేసవి సెలవలకు వెళ్ళినప్పుడు మామలు అత్తలు నేర్పించెను తెలుగు వాచకం,
తెలుగు వ్రాయటం చదవటం అనంతరం నేర్చుకున్నాం ఈనాడు ఆదివారంనాటి పదవినోదం |౫|
వెండితెర మీద వీక్షించాం అలనాటి మేటి చిత్రాలు,
ఎదో ఒక సామజిక విలువ నేర్పించాయి ఆ సువర్ణ చలనచిత్రాలు |౬|
ఇలాంటివి ఎన్నో ఉన్నాయి చిన్ననాటి తియ్యటి స్మృతులు,
మదిలో నిలిచిపియెను మన తెలుగు భాష పద్యాలూ సామెతలు కీర్తనలు కృతులు |౭|