చిన్నారి పాదాలు
చిన్నారి పాదాలు

1 min

22.8K
చూసుకుంటారు తల్లిదండ్రులు తమ చిన్నారి పాదాలు కందకుండా
మరుక్షణమే అడిగినవన్నీ అమరుస్తూ ఉంటారు ఎంతో
హడావుడిగా
వారి చదువులకోసం కష్టపడతారు వీరు రాత్రి, పగలు అనక ఓర్పుగా
చిన్నారి గుండెలపై తన్నిన తన్నులు, తలచుకొని ఆనందిస్తారు మథుర స్మృతులుగా
చిన్ననాడు తెలియక గుండెలపై తన్నినా, ఇప్పుడు తెలిసీ అదే పని చేస్తారుగా
పెద్దయ్యాక నిర్దాక్షిణ్యంగా పిల్లలు వదిలి పోతుంటే బాధపడతారు కన్నీరుమున్నీరుగా